Telanganapolitics: తెలంగాణలో బీసీల చుట్టు ‘‘రాజకీయాలు’’ తిరుగుతున్నాయి. ఓడెక్కే వరకు ఓడ మల్లన్న..ఓడ దిగాక బోడ మల్లన్న. అన్నట్లు బీసీల పట్ల రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయి. అగ్ర కులాల వారు రెండు దశాబ్దాలుగా రాజ్యాధికారం చేపడుతున్నారు. కానీ జనాభాలో 50 నుంచి 60 శాతం ఉన్న బీసీలు రెండు అక్కెన్ల పరిధిలోపు అసెంబ్లీకి పరిమవుతున్నారు. దీనికి కారణం అధికారం చేజిక్కించుకుంటున్న రాజకీయ పార్టీ వాళ్లది తప్పా..? రాజ్యాధికారం చేజిక్కించుకోవడంలో వెనుకబాటులోఉంటూ వస్తున్న బీసీలది తప్పా..? అంటే సమాధానం చెప్పాల్సింది బీసీలే. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలకు ఓట్ల కోసం బీసీలు గుర్తుకు వస్తారు. కాని ఎన్నికల సమయంలోనే బీసీలకు అసెంబ్లీ స్థానాలు ఎక్కువ ఇవ్వాలని, బీసీలను ఉప ముఖ్యమంత్రిని చేయాలని, మంత్రి పదవులు ఇవ్వాలని అధికార పార్టీలకు గుర్తుకు రాదు. ఇలాంటి పదువులు రావాలని బీసీల డిమాండ్‌గా ఉంటు వస్తుంది.. బీసీలకు రాజ్యాధికారం రావాలని వేదికలపై మాట్లాడే నాయకులకు మాత్రం బీసీలను ఐక్యం చేయడానికి చేతులేత్తే నాయకులు కనిపించరు. అడుగంది అమ్మ కూడ అమ్మ అన్నం పెట్టదు. బీసీలకు రాజ్యాధికారం కావాలని, రావాలని పోరాటాలు చేసిన చరిత్ర తెలంగాణలో లేదు. పత్రికల్లో ప్రకటనలకే పరిమతమవుతున్న నాయకులను బీసీలు నమ్ముకున్నంత కాలం రాజకీయ పార్టీలకు బీసీలు ఓటర్లుగా మాత్రమే గుర్తుంటామనే విషయాన్ని బీసీ రాజకీయ నాయకులు గుర్తించుకోవాలి. దేశంలో అనేక రాష్ట్రాల్లో సామాజిక వర్గాలు ఉమ్మడిగా ఉంటు తమ పంతాలను నెగ్గించుకున్నాయి. ఉదహరణగా పరిశీలిస్తే .. కర్ణాటకలో లింగాయత్‌లుగా చెప్పుకోవచ్చు. బీసీల్లో ఎన్ని కూలాలు ఉన్నాయి.? వారి వృత్తులు ఏమిటీ,? వారి అర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి?, రాష్ట్ర జనాభాల్లో బీసీలు ఎంత మంది ఉన్నారు? బీసీలకు ఉన్న హక్కులు ఏమిటనే విషయాలపై నాయకులు బీసీల్లో అవగహన కల్పించలేకపోయారు. అందరు బీసీ ఐక్యతకు సిద్దం కావాలంటారు కాని..పోరాటాలు చేయరు. పోరాటాలతోనే రాజ్యాధికారం అందివస్తుందనే విషయాన్ని గుర్తించరు. బీసీల సంగతి ఎలా ఉన్నా.. అధికార, ప్రతిపక్ష పార్టీలు బీసీలకు గుర్తించాల్సిన అవసముంది.
బీసీలు..అంటే.
బీసీలు అంటే కుల వృత్తులకు కేరాఫ్ అడస్ర్ అని చెపుతారు. బీసీలు అంటే వెనుకబడిన(తరగతుల) వారు. కట్టె కాలే వరకు వెనుకబాటు తనంలో జీవించేవారు గుర్తింపు మాత్రమే ఉంది. తెలంగాణ జనాభాలో 50నుంచి 60 శాతంగా బీసీ జనాభా ఉంటుంది. 80 నుంచి వంద మేర బీసీ కులాలు ఉన్నాయి. కుల వృత్తులు చేసే వారు కొందైతే..వృత్తి అంటే ఏమి లేకుండా అన్ని రకాల పనులు చేసే బీసీలే అధికం. కుల వృత్తిని మించింతి లేదురా .. గువ్వల చెన్నా..? అన్న సామెత కనుమరుగయ్యింది. కుల వృత్తిని నమ్ముకొని జీవించే కుమ్మరి, కమ్మరితోపాటు విశ్వకర్మలు, గౌడ్స్, పద్మశాలీలు, యాదవులు, ముదిరాజులు మాత్రమే కొద్దిపాటిగా కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నారు. కార్పోరేట్ రంగంతో కుల వృతులకు ఉపాధి లేకుండా పోయింది. దీంతో జీవనోపాధికి దొరికిన పనిని కులవృత్తి అనుకుంటు జీవించడానికి చాల మంది అలవాటు పడిపోయారు. ఇతర బీసీల కులవృతులు విభిన్న రీతుల్లో సాగుతున్నాయి. ‘‘మిథం జగత్’’ అన్నట్లుగా ఉపాధి కోసం ఎవ్వరు ఏదైనా చేయాల్సిన సంస్కృతి వచ్చేసింది. పల్లెల్లో అక్కడక్కడ కనిపించే కులవృత్తులు పట్టణాల్లో కనుమరగయ్యాయి. కులవృత్తులు కాస్తా..కులాలుగా పిలువబడే స్థాయికి ఎదిగాయి.
చట్టసభల్లో బీసీలకు లేని ప్రాధాన్యత..
అసెంబ్లీ ఎన్నికల వస్తున్నాయంటే చాలు.. అసెంబ్లీ టికెట్లు అలోచించే బీసీ నాయకులు బీసీ వాదం గుర్తుకు వస్తుంది. ఇది ఒక్క రాజకీయ పార్టీలోనే కాదు అన్ని రాజకీయ పార్టీల్లో బీసీ నాయకుల్లో మదిలో మేదిలే అలోచనలే. బీసీలకు ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలని, బీసీలకు ఎక్కువ సీటు కేటాయించాలని నినాదాల్ని లేవనేత్తుతారు. ఉమ్మడి రాష్ట్రంలో బీసీలు ఎక్కువగా తెలుగుదేశం పార్టీవైపు ఉండేవారు. ఉమ్మడి రాష్ట్రం కాస్తా.. రెండు రాష్ట్రాలుగా విడిపోవడం జరిగింది. తెలంగాణలోని టీడీపీ బీసీలు అంత కలిసి నాటి టీఆర్ఎస్, నేటి బీఆర్ఎస్లో చేరారు. అప్పటి గణాంకాల ప్రకారం చూస్తే 50 శాతంపైగా బీసీలు అధికార పార్టీలో చేరారు. బీఆర్ఎస్లో బీసీ మంత్రులుగా గంగుల కమాలాకర్, శ్రీనివాసగౌడ్, తలసాని శ్రీనివాస యాదవ్, పువ్వాడ అజయ్‌కుమార్ మంత్రులుగా ఉన్నారు. తెలంగాణలో 119 స్థానాల్లో కేవలం 21బీసీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో బీసీ లీడర్లుగా పొన్నాల లక్ష్మీనారాయణ, హన్మంతరావు, కొండ సురేఖ దంపతులు, మధుయాష్కీగౌడ్, పోన్నం ప్రభాకర్ లాంటి వారు, బీజేపీ బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద, డాక్టర్ లక్ష్మణ్ , భూర నర్సయ్యగౌడ్‌లు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రతి పార్లమెంట్ స్థానంలో ఇద్దరి, లేదా ముగ్గురికి బీసీలకు టిక్కెట్లు ఇవ్వాలని ప్రణాళికలు చేపట్టారు. ఈ సారానైనా.. పటేన్లు , రావుల (వెలమల) చేతుల్లో ఉన్న బి`ఫారాలు బీసీలకు ఎక్కువగా ఇవ్వాలని బీసీలు అందరు కోరుకుంది.
కమిషన్లే పూను కోవాలి..
బీసీలు సామాజిక,అర్థిక, విద్యా, ఆచార వ్యవహారాలు ఆధ్యానాలు చేయడం కమిషన్ల పని. వీటిన్నంటితోపాటు బీసీలకు రాజకీయ ఉపాధి కల్పనకు బీసీ రిజర్వేషన్లు ఉండాలని కమిషన్ల సిఫారులు చేయాలి. రాజకీయ పార్టీలు కేవలం విద్యా, ఉద్యోగాల అవకాశాలపై అధ్యాయనాలు చేయాలని బీసీ కమిషన్లను ప్రభుత్వాలు అదేశిస్తున్నాయి. దీంతో బీసీలు నాటి నేటి వరకు? రేపటి వరకు ? బీసీలు యధాస్థితిలో ఉండాలని పాలకవర్గాలు అలోచిస్తున్నాయి. బీసీ గనణ చేపట్టడానికి ప్రభుత్వాలు ముందుకు రావడం లేదు. కారణాలు ఏమైనా కాని కమిషన్లు కనీసం బీసీలకు ఉన్న హక్కులపై సమాచారాన్ని అందించలేక పోతున్నాయనే అపవాదు వారిపై ఉంది. అధ్యాయనాల సంగతి ఎలా ఉన్నా.. కనీసం బీసీలకు హక్కులపై ప్రచారాన్ని చేస్తేకాని.. బీసీల్లో చైతన్యం వచ్చె అవకాశాలు ఉంటాయి. బీసీలకు ఉన్న హక్కులు తేలిస్తేనైనా..వాటికోసం పోరాటాలు చేయడానికి బీసీలు సమాయత్తమవుతారు. ముందుగా హక్కుల సాధన, ఆ తర్వాత ఎమ్మెల్యే సీట్లు అడుగడానికి అవకాశం ఉంటుంది. బీసీలకు ఉన్న హక్కులపై కమిషన్లు తమవంతు బాధ్యతగా ప్రచారం చేయాల్సిన అవసరముంది. అధికారంలో రాజకీయ పార్టీ తాయిలాలతో బీసీ ఓట్లను కోట్లగొట్టె ప్రయత్నాలు ప్రస్తుతం చేస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలు హమీలతో సరిపెడుతున్నాయి. ఈ రెండిరటిపై దృష్టి పెడుతున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు రాబోయే ఎన్నికల్లో బీసీలకు ఎక్కువగా సీట్లు ఇచ్చి తమ నిజాతీయిని నిరూపించుకోవాల్సిన అవసరముంది. బీసీలందరు సమైక్యంగా ఉద్యమాల బాట పడితే..అసలుకే ఎసరు వస్తుందిందని గుర్తించుకోవాల్సిన అవసముంది.
======================
బొజ్జ రాజశేఖర్, సీనియర్ జర్నలిస్టు