డార్క్ సర్కిల్స్ పోగొట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

ప్రస్తుతం ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య కంటి కింది నల్లటి వలయాలు. నిద్రలేమి కారణంగా.. వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఇంతకు ఈ సమస్యను అధిగమించేందుకు తీసుకోవల్సిన జాగ్రత్తలు ఎంటో తెలుసుకోండి.

కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ రావడానికి ప్రధాన కారణం నిద్రలేమి. వర్క్ పనిలో భాగంగా ఆలస్యంగా నిద్రపోవడం.. ఎక్కువ సేపు కంప్యూటర్ మీద పని చేయడం..టీవీ చూస్తూ కాలక్షేపం చేస్ వారిని ఈ సమస్యను ఎక్కువగా ఫేస్ చేస్తుంటారు. అంతేకాక శరీరంలో రక్తలేమి వారిని కూడా ఈ సమస్య బారిన పడే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.

లక్షణాలు :
డార్క్ సర్కిల్స్ సమస్యతో బాధపడుతున్న వారిలో ఈ లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. కంటి చుట్టూ ఉన్న చర్మ దురదగా అనిపిస్తుంది. తద్వారా చర్మాన్ని నలుపుకుంటూ ఉంటారు. అలా చేయడం వల్ల చర్మం నల్లగా మారే అవకాశం ఉంది. కొంతమందికి కళ్ళ కింద పొడిచర్మం ఉండటం వలన డార్క్ సర్కిల్స్ ఏర్పడేందుకు ఆస్కారం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

తీసుకోవల్సిన జాగ్రత్తలు :
కళ్ళ కింద చర్మం దురదగా ఉన్నపుడు.. నలుపుకో కుండా ఉండేందుకు ప్రయత్నించాలి. పొడి చర్మం ఉన్నవాళ్లు ఎప్పటికప్పుడు మాయిశ్చరైజర్ రాసుకోవాలి. సన్​స్క్రీన్​ లోషన్​ వంటివి సందర్భానుసారం వాడుతూ ఉండాలి. ఇక ఈ సమస్య తో బాధపడుతున్న వారిలో.. ఇతరత్రా అనారోగ్య సమస్యలు ఉంటే వైద్యున్ని సంప్రదించాలి.
ఇక ఉద్యోగం వృత్తిలో భాగంగా నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు తగినంత సమయాన్ని నిద్ర కు కేటాయించాలి. టీవీ కంప్యూటర్ తో కాలక్షేపం చేసేవాళ్ళు .. ఎక్కువసేపు వాటి ముందు కూర్చోకుండా ఉండేలా చూస్కుంటే.. ఈ సమస్యను అధిగమించేందుకు ఆస్కారం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.

Optimized by Optimole