క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ర్ ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ కలయికలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ‘ ఉప్పన ‘ సినిమాతో హిట్ కొట్టిన సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘పుష్ప ‘ పది కేజీల తో సమానం.. హీరో ఎలివేషన్ పాత్ర చూస్తుంటే మతి పోతుంది.. ఈ సినిమా గ్యారెంటీగా అన్ని రికార్డులను బద్దలు కొడుతుంది అని బుచ్చిబాబు అన్నాడు. తాను రీసెంట్ గా ఈ చిత్రం చూశానని.. ఈ సినిమా పై అభిప్రాయాన్ని ఒక్కమాటలో చెప్పేశాడు.
సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో హ్యాట్రిక్ చిత్రం గా రాబోతున్న పుష్ప సినిమా..శేషాచలం అడవుల్లో సాగే కథతో రాబోతుంది. చిత్రకరణలో ఇప్పటికే సింహభాగం పూర్తయింది. మిగిలిన భాగాన్ని త్వరలోనే పూర్తి చేయనున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీమేకర్స్ నిర్మిస్తోంది. కాగా చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించనున్నారు . బన్ని సరసన రష్మిక మందన జోడీ కట్టింది. ఫహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నాడు. దేవిశ్రీప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఆగస్టు 13న ‘పుష్ప’ను రిలీజ్ చేయాలని చిత్రబృందం భావించింది. అయితే కరోనా పరిస్థితుల రీత్యా సినిమా విడుదలపై ఎలాంటి స్పష్టత రాలేదు. తొలుత ఒకే పార్ట్ తీయాలని భావించినప్పటికీ.. కథ పెద్దది కావడంతో రెండు భాగాలుగా తీయాలని అని దర్శకనిర్మాతలు నిర్ణయించారు. ‘పుష్ప’ మొదటి భాగం ఈ ఏడాది.. రెండో భాగం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పటికే విడుదలైన చిత్ర టీజర్ ‘తగ్గేదేలే’ అంటూ యూట్యూబ్‌లో రికార్డులు బద్దలు కొడుతోంది.