సీఎం కేసీఆర్ పై విజయశాంతి సెటైర్లు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మాజీ ఎంపీ బిజెపి నేత విజయశాంతి సెటైర్లు విసిరారు. సీఎం కేసీఆర్ అన్ని జిల్లాల పర్యటన నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ మాటకు భయపడాల్సిన అవసరం లేదని.. ఆయన ఓట్ల పండగ అప్పుడు తప్ప.. ఫాంహౌస్ నుంచి బయటకు రాడని ఎద్దేవా చేశారు.
పల్లె ప్రగతి పట్టణ ప్రగతి పనులను తానే స్వయంగా పరిశీలిస్తానని.. అభివృద్ధి పనులకు సంబంధించి అన్ని రిపోర్ట్స్ అందుబాటులో ఉండాలని లేనిచో కఠిన చర్యలు తీసుకుంటామని కెసిఆర్ అధికారులను ఆదేశించిన మరునాడే విజయశాంతి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఇక‌, నాగార్జున‌సాగర్ ఎన్నికలప్పుడు 15 రోజుల్లో మళ్ళీ సాగర్ వచ్చి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానన్నా ముఖ్యమంత్రి… నెలన్నర దాటినా అతి గతీ లేద‌ని విజ‌య‌శాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకు ముందు హుజుర్ నగర్ ఎన్నికలప్పుడు ఇవే మాటలు మాట్లాడారని గుర్తు చేశారు. చాలా ఏళ్ళ కిందట వరంగల్ నగరం మురికివాడలకు వచ్చి… వారికి కొత్త ఇళ్ళు కట్టిస్తానని, దావత్ చేసుకోవడానికి 5 నెలల్లో మళ్లీ వస్తానని అన్నారు…ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పక్కర్లేద‌న్నారు.. ఇక ఈ తాజా చెకింగులు, వార్నింగుల అర్థమేంటో నేను చెప్పాల్సిన పనిలేదని.. ఆయన దర్శనం కావాలంటే మళ్ళీ ఓట్ల పండగ రావాలని విజయశాంతి పేర్కొన్నారు