కరోనాతో మరో సింహం చనిపోయింది. చెన్నైలోని వాండలూర్ అన్నా జూపార్కులో కరోనాతో 12ఏళ్ల ఆసియా మగ సింహం.. బుధవారం మరణించినట్లు జూ అధికారులు తెలిపారు. కరోనా పాజిటివ్‌గా తేలిన తర్వాత అత్యవసర విభాగంలో ఉంచి.. మృగరాజుకు చికిత్స అందించినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఇక సింహానికి కరోనా లక్షణాలు కనిపించగా.. జూలోనే పరీక్షలు నిర్వహించినట్లు పశువైద్య అధికారులు తెలిపారు. నమూనాలను మధ్యప్రదేశ్ భూపాల్‌లోని ఎన్ఐహెచ్ఎస్ఏడీకి పంపినట్లు తెలిపారు.మొత్తం 14 సింహాల్లో ఏడు కరోనా బారిన పడ్డాయి. వారం వ్యవధిలో రెండు సింహాలు చనిపోయాయి. దీంతో జూ పార్క్ అధికారులు అప్రమత్తమయ్యారు. మిగతా సింహాల పట్ల తగు జాగ్రతలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.