ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ కు భారత జట్టు ప్రకటన!

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. సౌతాంప్టన్ వేదికగా న్యూజిలాండ్ తో ఫైనల్ పోరు శుక్రవారం జరగనుంది. జట్టు ఎంపికను పరిశీలిస్తే.. కెప్టెన్ కోహ్లీ అనుభవజ్ఞులకు ప్రాధాన్యం ఇచ్చారని తెల్సుతోంది. 11 మంది సభ్యులు గల జట్టులో కీపర్ గా ధోనీ వారసుడిగా కితాబు అందుకుంటున్న రిషబ్ పంత్ కి జట్టులో స్థానం లభించింది. స్పిన్నర్స్ కోటాలో రవి చంద్రన్ అశ్విన్.. ఆల్ రౌండర్ గా రవీంద్ర జడేజాను జట్టులోకి తీసుకున్నారు. అలాగే కౌంటీ అనుభవం ఉన్న హనుమా విహరిని జట్టులోకి తీసుకోలేదు. ఓపెనర్ల బాధ్యతను రోహిత్ , గిల్ కు అప్పగించారు. పేస్ బౌలర్లుగా మహ్మద్ షమీ, జస్ప్రీట్ బుమ్ర, ఇషాంత్ శర్మ జట్టును ముందుండి నడిపించినున్నారు.

భారత జట్టు:

విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌గిల్, ఛెతేశ్వర్‌ పుజారా, అజింక్యా రహానె (వై.కె) రిషభ్‌ పంత్‌(వి.కీ), రవీంద్ర జడేజా, అశ్విన్‌, బుమ్రా, ఇషాంత్‌ శర్మ, మహ్మద్‌ షమీ.