కరోనా థర్డ్ వేవ్ పై ఆందోళన అవసరం లేదు_డబ్ల్యూహెచ్ఓ

కరోనా థర్డ్ వేవ్ చిన్నారులపై ప్రభావం చూపే అవకాశాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్ల్యూహెచ్​ఓ) తెలిపింది. ఎయిమ్స్ సంయుక్త సంస్థ అధ్యయనంలో ఈ విషయం స్పష్టం అయ్యిందని పేర్కొంది. చిన్నారులు, వయోజనుల్లో సీరో పాజిటివిటీ రేటు ఒకే స్ధాయిలో ఉందని తెలిపింది. అధ్యయనంలో భాగంగా.. ఈ ఏడాది మార్చి 15 నుంచి జూన్10 మధ్య దేశంలోని అయిదు ప్రాంతాల్లో రెండేళ్ల వయసు నుంచి వయోజనుల వరకు…. 4 వేల 59 నమూనాలను సేకరించారించామని తెలిపింది. పూర్తి స్ధాయి అధ్యయనం ఇంకా కొనసాగుతున్నదని స్పష్టం చేసింది.

సీరో పాజిటివిటీ రేటు 18 ఏళ్ల లోపు వారిలో 55.7శాతం, అంతకంటే ఎక్కువ వయసున్న వారిలో.. 63.5శాతం ఉందని డబ్ల్యు.హెచ్ ఓ తెలిపింది. ఇన్నాళ్లూ వయోజనుల స్థాయిలోనే పిల్లల్లోనూ కరోనా ప్రభావం చూపిందని.. ఈ అధ్యాయాన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చని వైద్య నిపుణులు చెప్పుకొచ్చారు . కరోనా థర్డ్ వేవ్ వస్తే చిన్నారుల్లో ప్రభావం చూపిస్తుందనే ఆందోళన అవసరం లేదని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది