ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, సుకుమార్ కలయికలో రాబోతున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప. ఈ సినిమా గురించి బన్నీ అభిమానులు, ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేశారు. ఎప్పటిలాగే ఐకాన్ స్టార్ మాస్ నట విశ్వరూపం చూపించారు. ట్రైలర్ చివరలో.. ఈ లోకం నీకు తుపాకీ ఇచ్చింది.. నాకు గొడ్డలి ఇచ్చింది.. ఎవడి యుద్ధం వాడిదే అంటూ బన్నీ చెప్పిన డైలాగ్ సినిమాపై అంచనాలను పెంచేసింది. తొలి సారిగా బన్నీకి జోడీగా కట్టిన రష్మిక.. మరోసారి నటనకు స్కోప్ ఉన్న పాత్రలో కనిపించబోతుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. కమెడియన్ సునీల్ ప్రతి నాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు.
కాగా ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది.ఇప్పటి వరకు స్టైలిష్ లుక్‌లో కనిపించిన బన్నీ తొలి సారి పూర్తి మాస్ రోల్‌లో కనిపించబోతున్నాడు. బన్నీ_ సుకుమార్ కాంబినేషన్లో ఆర్య, ఆర్య2 వంటి చిత్రాల తర్వాత రాబోతున్న పుష్ప రెండు పార్ట్లుగా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.