రాహుల్‌ గాంధీ ప్రధాని పదవికి, పెళ్లికి, సొంతింటికి ఇప్పుడు– పర్ఫెక్ట్‌ ఫిట్‌..

Nancharaiah merugumala: (senior journalist)

రాహుల్‌ గాంధీ ప్రధాని పదవికి, పెళ్లికి, సొంతింటికి ఇప్పుడు– పర్ఫెక్ట్‌ ఫిట్‌

రాహుల్‌ గాంధీ వయసు–52 సంవత్సరాలు
అయినా–ఆయనకు సొంత ఇల్లు దేశంలో ఎక్కడా లేదు
పెళ్లి కూడా ఇంకా కాలేదు..!
కాని, తనకు పిల్లలు కావాలన్న కోర్కె ఉందని రాహుల్‌ ఈమధ్యనే చెప్పారు
తొలి ప్రధాని జవాహర్‌ నెహ్రూకు రాహుల్‌ మునిమనవడు
మూడో ప్రధాని ఇందిరాగాంధీకి రాహుల్‌ భయ్యా మనవడు
ఆరో ప్రధాని రాజీవ్‌ గాంధీకి ఆయన కొడుకు
ఆయన కుటుంబంలో ముగ్గురు మాజీ ప్రధానులున్నా… 2019 పార్లమెంటు ఎన్నికల నాటికి రాహుల్‌ స్వయం ప్రకటిత ఆస్తి విలువ రూ.15.8 కోట్లు మాత్రమే.
మరి ఆయన చెల్లెలు ప్రియాంకా గాంధీ వాడ్రాకేమో హిమాచల్‌ ప్రదేశ్‌ రాజధాని శిమ్లాలో సొంత ఇల్లు ఉంది. ఇంకా 51 ఏళ్ల ఈ యువ నాయకురాలికి భర్త రాబర్ట్, ఇద్దరు పిల్లలు రేహాన్, మిరాయా ఉన్నారు. ఆమె కొడుకు రేహాన్‌– యూనివర్సిటీ ఆఫ్‌ లండన్‌ లోని స్కూల్‌ ఆఫ్‌ ఓరియంటల్‌ అండ్‌ ఆఫ్రికన్ స్టడీస్‌(ఎస్వోఎస్‌)లో ఎంఏ పూర్తిచేసుకుంటున్నాడు.
ఈ లెక్కన రాహుల్‌ గాంధీకి ప్రధానమంత్రి పదవి, భార్య, పిల్లలు చివరికి తనకంటూ ఓన్‌ హౌస్‌ సొంతమయ్యేనాటికి ఆయనకు ఎంత వయసు వస్తుందో?
ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ మాదిరిగానే మొన్న రాహుల్‌ తన బవిరి గడ్డం తొలగించి చక్కగా ట్రిమ్‌ చేయించుకున్నారు. పెళ్లికి, ప్రధాని పదవికి, దిల్లీలో సొంత ఇల్లు సంపాదించుకోవడానికి అన్ని విధాలా రాజీవ్‌ గాంధీ చాలా ఫిట్‌ గా కనిపిస్తున్నారు. ప్రధాని నరేంద్రభాయ్‌ కి భార్య ఉన్నా పిల్లలు లేరు. ప్రధాని పీఠంపై తొమ్మిదేళ్లుగా కూసుని ఉన్నా న్యూఢిల్లీలో మోదీకి సొంతిల్లు లేదు. మరి 72 ఏళ్ల వయసులో నరేంద్రకు ఇల్లూ, పిల్లల రాత లేనట్టే. ప్రధాని పదవి కూడా మరో ఆరేళ్లలో ఆయన చేజారిపోయే ప్రమాదం కూడా ఉంది.
– అందుకే, ఆల్‌ ద బెస్ట్‌ రాహుల్‌ భయ్యా!

 

Optimized by Optimole