లాలూ ప్రసాద్ తో రాహుల్ గాంధీకి పోలికా?

Nancharaiah merugumala (senior journalist)

రెండేళ్లకు పైగా జైలు శిక్ష కారణంగా బిహార్ ప్రజానాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ తో కలిపి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. ఈ ఇద్దరు నాయకులూ కోర్టుల్లో శిక్షలు పడి లోక్ సభ సభ్యత్వానికి అనర్హులు కావడం తప్ప వారి మధ్య ఏమైనా పోలిక ఉందా? లాలూ రాజకీయ, సామాజిక నేపథ్యం, బిహార్ ముఖ్యమంత్రిగా విలక్షణ పాలన వంటి గొప్ప విషయాలు పరిశీలిస్తే… ఇందిరమ్మ పెద్ద మనవడికి అంత స్థాయి ఉందా అని అనుమానం వస్తోంది. లాలూ మోకాళ్ల వరకూ రాని ఈ 52 ఏళ్ల యువరాజు ఆర్జేడీ స్థాపకుడిలా పోరాడగలడా? అంటే…లేదనే జవాబు వస్తుంది. అతి మామూలు కుటుంబం నుంచి వచ్చిన లాలూకూ, రాయల్ ఫామిలీ లో పుట్టిన తెల్లతోలు మొద్దబ్బాయికి ఏమైనా పొంతన ఉందా?