చిత్రం : అరణ్య
తారాగణం: రానా, విష్ణు విశాల్, పులకిత్ సామ్రాట్, జోయా హుస్సెన్, తదితరులు
సంగీతం: శంతన్ మొయిత్రా
సినిమాటోగ్రఫీ: ఏఆర్ అశోక్‌కుమార్;
ఎడిటింగ్: భువన్ శ్రీనివాసన్
నిర్మాణ సంస్థ: ఎరోస్ ఇంటర్నేషనల్
దర్శకత్వం: ప్రభు సాల్మన్
విభిన్న కథలతో ప్రేక్షకులను అలరిస్తూ, తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నా నటుడు రానా దగ్గుబాటి. హీరోగా నటిస్తునే బాహుబలి వంటి ప్రతిష్టాత్మక చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో నటించి అంతార్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించాడు. చాలా గ్యాప్ తర్వాత, మళ్లీ అతను హీరోగా అరణ్య చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శుక్రవారం విడుదలయిన ఈచిత్రంపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా చూద్దాం !
కథ : విశాఖపట్టణం దగ్గరలోని చిలకోన అడవిలో నరేంద్రభూపతి (రానా) నివసిస్తుంటాడు. అడవిలోని ఏనుగులను సంరక్షిస్తూ జీవనం సాగిస్తుంటాడు. అందుకుగాను అతనికి రాష్ట్రపతి పురస్కారం కుడా లభిస్తుంది. ఈ క్రమంలోనే కేంద్రమంత్రి కనకమేడల రాజగోపాలం(అనంత్ మహదేవన్) కన్ను ఆ అడవిపై పడుతుంది. అక్కడ టౌన్ షిప్ నిర్మించి అడవిని కాజేయాలని పన్నాగం పన్నుతాడు. అందులో భాగంగానే ఏనుగులు నీటి కోసం వెళ్లే దారిని మూసేయిస్తాడు. మరి అడవినే నమ్ముకున్న నరేంద్రిభూపతి ఎలా రియాక్ట్ అయ్యాడు ? కేంద్రమంత్రి పన్నాగం ఎంతవరకు ఫలించింది ? అన్నది తేలియాలంటే సినిమా చూసి తీరాల్సిందే!
ఎలా ఉందంటే : అడవిని , జంతువులను తల్లిలిగా చూసుకుంటున్న ఓ వ్యక్తి కథ ఇది. గతంలో ఇలాంటి కథలు సినిమాగా వచ్చిన ఈ కథ కొంచెం భిన్నంగా ఉంది. అడవికి, జంతువులకి మధ్య ఉండే అనుబంధాన్ని దర్శకుడు చెప్పిన తీరు బాగుంది. అడవిలోని సన్నివేశాలను తెరకెక్కించిన విధానం అకట్టుకుంది. సినిమాలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకుడుని కట్టిపడేస్తుంది. సాంకేతికత పేరుతో అడవుల్ని నాశనం చేస్తున్నతీరును దర్శకుడు చూపించిన విధానం మనల్ని ఆలోచనలలో పడేస్తుంది. ప్రథమార్థం అంతా టౌన్ షిప్ కాంట్రాక్టర్‌కు, నరేంద్రభూపతి మధ్య పోరు నడుస్తుంది. ఇందులో ఉపకథగా ఏనుగు శింగన్న (విష్ణు విశాల్), నక్సలైట్ మల్లి (జోయా) పాత్రలను దర్శకుడు జోడించిన విధానం ఆకట్టకుంటుంది. కానీ ద్వితియార్థంలో ఆ పాత్రల కారణం లేకుండానే అర్థాతరంగా ముగిసిపోతాయి. హీరో, కేంద్ర మంత్రి మధ్య సంభాషణలు ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు చివరి 30 నిమిషాలు అదనపు బలం. క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేషాలు ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేస్తాయి.
బలం :
రానా నటన
కథ
క్లైమాక్స్
బలహీనతలు :
స్క్రీన్ ప్లే
చివరగా: సమాజంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా.