భవిష్యత్ ప్రపంచం సృష్టించేందుకు సిద్ధమవుతున్నాం : నాగ్ అశ్విన్

రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం లో వైజయంతి మూవీస్ ఓ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో కథానాయికగా స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ అమితాబచ్చన్ ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడుగా మిక్కీ జే మేయర్, ఛాయాగ్రాహకుడిగా శాంచిజ్ లోపేజ్ ను ఎందుకు చేసినట్లు దర్శకుడు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ.. మహానటి కోసం గతం నుంచి ఒక ప్రపంచాన్ని సృష్టించాం .. ‘భవిష్యత్తు కోసం మరో ప్రపంచం సృష్టించేందుకు సిద్ధమవుతున్నాం .. కుర్రాళ్లకు స్వాగతం’ అంటూ ట్వీట్ చేశారు. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో  తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించి పనులు శరవేగంగా జరుగుతున్నాయి.