ఇంగ్లాండ్ టూర్ కోసం కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టును బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. తుది జట్టులో ఓపెనర్ పృథ్వి షా తోపాటు, స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కు చోటు దక్కలేదు. గాయంతో కోలుకున్న రవీంద్ర జడేజా, పేసర్ మహ్మద్ షమీ జట్టులోకి తిరిగొచ్చారు. కాగా ఇదే జట్టును జూన్లో న్యూజిలాండ్ తో జరిగే ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు కొనసాగించనున్నారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా భారత జట్టు, ఇంగ్లాండ్ టూర్ కోసం రెండు వారాల ముందే బయల్దేరే అవకాశం ఉంది.
భారత జట్టు :
విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానే (వైఎస్ కెప్టెన్), రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్, పుజారా, విహారి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, బుమ్రా, ఇషాంత్ శర్మ, షమీ, సిరాజ్, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్.