Religion:
- మతం నంబర్1
బెంగళూరుకు చెందిన ఆ మహిళ కేరళలోని పెరింగొట్టుకుర ఆలయానికి వెళ్లింది. అక్కడ ప్రత్యేక పూజలు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని ఆమె ఆలోచన. ఆలయానికి వెళ్లిన సమయంలో అక్కడున్న అరుణ్, ఉన్ని దమోదరన్ అనే పూజారులతో ఆమెకు పరిచయం ఏర్పడింది. పూజలు చేయిస్తామని వారు చెప్పడంతో ఆమె వారి నెంబర్ తీసుకుంది. ఆ తర్వాత వారి నుంచి ఆమెకు వాట్సాప్ వీడియో కాల్స్ రావడం మొదలైంది. ఆమెతో వారు అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. తమ మాట వినకపోతే చేతబడి చేయిస్తానమని, తమతో శృంగారం చేయాలని బలవంతం చేశారు. నగ్నంగా వీడియో కాల్ చేయాలన్నారు. కేరళకు రావాలని బెదిరించగా ఆమె వెళ్లింది. అక్కడ కారులో ఆమెను అడవికి తీసుకెళ్లి లైంగికదాడికి యత్నించారు. పూజ పేరుతో ఆమెను లొంగదీసుకోవాలని ప్రయత్నించగా ఆమె తప్పించుకొని బెంగళూరు చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
• మతం నెంబర్ 2
అనంతపురం జిల్లా కేంద్రానికి చెందిన మహమ్మద్ ఫయాజ్‌కు 50 ఏళ్లు. స్థానిక మసీదుల్లో అతను మతపెద్ద. అతనికి సంతానం లేదు. బావమరిది కూతుర్ని పెంచుకుంటున్నాడు. ఆ పాపను చూసుకోవడానికి ఓ బంధువుల అమ్మాయిని ఇంట్లోనే పెట్టుకున్నాడు. తనకు 13 ఏళ్లు. ఆ పిల్ల మీద కన్నేసిన అతను భార్య ఇంట్లో లేని సమయంలో లైంగికదాడి చేసేవాడు. ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. ఇటీవల బాలికకు కడుపునొప్పి రావడంతో ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు పరీక్షించగా బాలిక గర్భవతి అని తేలింది. విషయం కనుక్కోగా ఫయాజ్ తన మీద చేస్తున్న అకృత్యాన్ని వివరించింది. పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.
• మతం నెంబర్ 3
పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం అయ్యవరంలో కుంచే వెంకటేశ్వరరావు అలియస్ మార్క్ పాస్టర్. స్థానికంగా చర్చి కట్టి ప్రార్థనలు చేస్తున్నాడు. ఓ నిరుపేద కుటుంబం ఆయన వద్దకు వస్తూ ఉండేది. వారి 14 ఏళ్ల కుమార్తె ఉంది. ఆ పాప కోసం ప్రత్యేక ప్రార్థనలు చేయాలని, తనను ఒంటరిగా రమ్మనమని చెప్పి ఆ పిల్లపై అతను అత్యాచారం చేశాడు. ఈ విషయం బయటకు చెబితే దేవుడి శాపం తగులుతుందని, ఎవరికీ చెప్పకూడదని అతను బెదిరించాడు. అనంతరం పాప ఆరోగ్యం దెబ్బతినడంతో పరీక్షించగా తను నాలుగు నెలల గర్భవతి అని తేలింది. దీంతో పాస్టర్ బండారం బయటపడింది. పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.
PS: దేవుడి సన్నిధిలో ఉండేవారిలో ఎటువంటి దుర్మార్గమైన ఆలోచనలూ ఉండవు. ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపేవారికి ఎటువంటి ఆశలూ ఉండవు. వారి మనసులో చెడు భావనలే ఉండవు. వారు స్వచ్ఛమైన వారు. కదా? Religions are always a COMMERCIAL AND CRUEL ENTITIES.
సకల తీర్థములను సకల యజ్ఞంబులను
తలలు గొరిగినంత ఫలము గలదె
తలలు బోడులైన తలపులు తలపులు బోడులా
విశ్వదాభిరామ వినురవేమ
– విశీ✍✍✍