మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం రిపబ్లిక్.పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దర్శకుడు దేవకట్ట. తేజ్ సరసన ఐశ్వర్య రాజేష్ జోడి లో నటిస్తుంది.జీ స్టూడియోస్ పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మణిశర్మ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించింది.అక్టోబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో సినిమా విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, టీజర్లకు మంచి స్పందన లభించింది.
కాగా ఈ సినిమాపై హీరో సాయితేజ్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. సినిమాలోని తన పాత్ర పేరును ‘పంజా అభిరామ్’ అని ట్విటర్ వేదికగా వెల్లడించాడు. ‘నా జీవితంలో ఇప్పటి వరకూ నేను ఎక్కువగా ప్రేమించిన పాత్ర ఇదే’ అంటూ ట్వీట్ లో పేర్కొన్నాడు. సరికొత్త పొలిటికల్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న చిత్రంలో.. సాయితేజ్ ఐఏఎస్ అధికారిగా శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు. జగపతిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.