రాహుల్ ప్లేస్ లో పంత్..కెప్టెన్ రోహిత్ మనసులో ఏముందంటే..?

రాహుల్ ప్లేస్ లో పంత్..కెప్టెన్ రోహిత్ మనసులో ఏముందంటే..?

T20 worldcup: టీ20 ప్రపంచకప్ ర‌స‌వ‌త్త‌రంగా సాగుతుంది. టీమిండియా వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతుంది. ఇప్ప‌టికే  రెండు మ్యాచుల్లో విజ‌యాలు సాధించిన టీమిండియా ఆదివారం దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే దాదాపు సెమీస్ బెర్తుకు మ‌రింత చేరువైతుంది. 

అయితే భార‌త బ్యాటర్ ఓపెనర్, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్  విఫ‌లం కావ‌డం భారత శిబిరంలో క‌ల‌వ‌ర‌పాటు గురిచేస్తుంది. దాంతో భార‌త్ అభిమానులు రాహుల్‌ను పక్కన పెట్టాల‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా డిమాండ్ చేస్తున్నారు. రాహుల్  స్థానంలో కీపర్ రిషభ్‌ పంత్‌ను ఆడించాల‌ని కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో రిషభ్‌ను ఓపెనర్‌గా ఆడిస్తే లెఫ్ట్, రైట్ కాంబినేష‌న్ తో టీమ్‌ఇండియా బ‌లంగా ఉంటుంద‌ని బ్యాటింగ్‌ కోచ్ విక్రమ్‌ రాఠోడ్ వ్యాఖ్యానించాడు. 

ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన విక్ర‌మ్..‘‘ఇప్పటి వరకు భార‌త్ కేవలం 2 మ్యాచ్‌లను మాత్రమే ఆడింది. రాహుల్ పై త‌మ‌కు న‌మ్మ‌కం ఉంద‌ని,  రెండు మ్యాచుల‌లో విఫలమైనంత మాత్రాన రాహుల్‌ బ్యాటింగ్‌ సామర్థ్యంపై న‌మ్మ‌కం పోద‌న్నారు. అయితే రాహుల్ బదులు పంత్‌ను తీసుకోవాల‌నే ఆలోచ‌న చేయ‌లేదు. ప్రాక్టీస్‌ మ్యాచుల్లో రాహుల్‌ చాలా బాగా ఆడాడు. అందుకే ఇలాంటి సమయంలో మరో ఆప్షన్‌ కోసం చూడటం లేదు. ఇక మ‌రింత మెరుగ్గ రాణిస్తాం, అయితే పిచ్‌ కండీషన్ అంచనా వేసి.. దానికి తగ్గట్టు ఆడటమే లక్ష్యం’’ అని చెప్పారు.

ఇక విరాట్ కోహ్లీ virat kohli సూప‌ర్ ఫాంపై విక్రమ్‌ స్పందించాడు. ‘‘వరుసగా రెండు మ్యాచుల్లో విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడుతున్నాడు. వ‌రుసగా రెండు అర్ధశతకాలు సాధించాడు. ఎలాంటి సంద‌ర్భంలోనైనా మ్యాచ్ మ‌లుపు తిప్ప‌గ‌ల‌ సమర్థుడు. ప్రత్యర్థి టీమ్‌ ఏదైనా సరే త‌న శైలిలో అద్భుతంగా అడ‌తాడు. కోహ్లీ అన్ని మ్యాచులు ఇలానే ఆడ‌తాడు  అని విక్రమ్‌ రాథోడ్ చెప్పాడు.