బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైనా'(బయోపిక్). ఈ చిత్రంలో ఆమె పాత్రను బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా పోషిస్తున్నారు. ఈచిత్రం పూర్తయి ఏడాది కావొస్తున్న కరోనా లాక్ డౌన్ తో వాయిదాపడింది. ఇప్పుడు ‘సైనా’ చిత్రాన్ని ఓటీటీ లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది.
కాగా కరోనా లాక్ డౌన్ సడలింపులతో థియేటర్స్ 50 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్న ప్రేక్షకులు అంతగా సుముఖుతగా లేరు. ఈ నేపథ్యంలో నిర్మాతలు సినిమా విడుదలకు ఓటీటీ సరైన వేదికాని భావిస్తున్నారు.