saindhavreview : విక్టరీ వెంకటేష్ తాజాగా నటించిన చిత్రం ‘సైంధవ్’. శ్రద్ధ శ్రీనాథ్ , రుహాని శర్మ ఆండ్రియా జెర్మియా కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి ‘ హిట్ ‘ ఫేమ్ శైలేష్ కొలను దర్శకుడు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి . శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ” సైంధవ్” ఎలా ఉందో సమీక్షలో చూద్దాం..!
కథ:
సైంధవ్ కోనేరు( వెంకటేష్) చంద్రవస్థ పోర్ట్ లో ఉద్యోగం చేస్తుంటాడు. కూతురు గాయత్రి( సారా) అంటే ప్రాణం. సైంధవ్ పక్కింట్లో ఉండే మనోజ్ఞ ( శ్రద్ధ శ్రీనాథ్) అతని పాపను సొంత కూతురిలా చూసుకుంటుంది. ఒకరోజు గాయత్రి ఉన్నట్టుండి కింద పడిపోతుంది.డాక్టర్స్ దగ్గరికి తీసుకెళితే .. పాపకు ఎస్ఎంఏ వ్యాధి ఉందని.. బతకాలంటే రూ.17 కోట్లు ఖరీదు చేసే ఇంజెక్షన్ చేయాలని చెబుతారు. ఆ డబ్బు కోసం సైంధవ్ ఏం చేశాడు? పాప ( గాయత్రి) బ్రతుకుంతుందా? వికాస్ మాలిక్(నవాజుద్దీన్ సిద్ధిఖీ) తో సైంధవ్ గొడవ ఏమిటి? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే..!
ఎలా ఉందంటే..?
సినిమా కథ పరంగా చూస్కుంటే.. ఇలాంటి కథలతో టాలీవుడ్ లో చాలా సినిమాలు వచ్చాయి.అయితే ఆ తాలూకు ఛాయలు సినిమాలో కనిపించకుండా డైరెక్టర్ జాగ్రత్త పడ్డాడు. ఫస్ట్ ఆఫ్ లో తండ్రి_ కూతురు సెంటిమెంట్, వెంకటేష్ _ శ్రధ్ధశ్రీనాథ్ మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఇక సెకండాఫ్ లో ఎమోషన్ సీన్స్ , హీరో _ విలన్ మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. ఓవరాల్ గా ఫస్ట్ ఆఫ్ ఒకే. సెకండాఫ్ బాగుంది.
ఎవరెలా చేశారంటే..?
నటన పరంగా వెంకటేష్ తన పాత్రకు ప్రాణం పోశాడు. ఎమోషనల్, యాక్షన్ సన్నివేశాల్లో ఆయన నటన నెక్స్ట్ లెవల్ అని చెప్పవచ్చు. హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్ తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. అందం, అభినయం పరంగా ఆకట్టుకుంది. విలన్ గా బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ పర్వాలేదు.తమిళ్ హీరో ఆర్య చేసింది చిన్న పాత్రే అయినా గుర్తుండిపోతుంది. రుహానీ శర్మ, ముఖేష్ రుషి, జయప్రకాష్ తదితరులు తమ తమ పాత్రల పరిధి మేర నటించారు.
సాంకేతిక నిపుణుల పనితీరు..
దర్శకుడు శైలేష్ కొలను చెప్పాలనుకున్న కథను తెరపై ప్రజెంట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. స్క్రీన్ ప్లే పరంగా జాగ్రత్త పడ్డాడు. సంగీతం పర్వాలేదు.పాటలు బాగున్నాయి.సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
చివరగా ఒక్క మాటలో.. వెంకీ మార్క్ ‘ సైంధవ్ ‘
రివ్యూ: 3/5( సమీక్ష ప్రేక్షకుడి దృష్టి కోణంలో ఇవ్వబడింది)