సమ్మక్క- సారక్క : జాతర కోసం మేడారం చేరుకునేందుకు రూట్ మ్యాప్ ..

మేడారం;  తెలంగాణ కుంభమేళ  సమ్మక్క సారక్క జాతరకు ములుగు జిల్లా మేడారం ఆహ్వానం పలుకుతోంది. ఇప్పటికే వనదేవతల దర్శనం కోసం వచ్చిన భక్తజనంతో ఆప్రాంతం కిక్కిరిస్తోంది. దాాదాపు కోటి మందికి పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకునే వీలుందని అధికారులు అంచనావేస్తున్నారు. అందుకు తగ్గట్లుగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. 

ఇక మేడారం వచ్చే భక్తుల కోసం రూట్ మ్యాప్.. 

  • మేడారం వెళ్లేందుకు ప్రధానంగా ఐదు రహదారులు ఉంటాయి. పస్త్రా , తాడ్వాాయి, చిన్నబోయినపల్లి , కాటారం, భూపాలపల్లి మీదుగా  మేడారం  చేరుకోవచ్చు.
  •         ఉమ్మడి ఆదిాలాబాద్ , కరీంనగర్ , నిజామాబాద్ ,  మహారాష్ట్ర ప్రాంతాల  నుంచి వాహనాల్లో వచ్చే భక్తులు కాటారం మీదుగా మేడారం చేరుకోవచ్చు.
  • (భూపాలపల్లి _ మేడారం) మీదుగా  మేడారం వచ్చిన వాహనాలు భూపాలపల్లి – మేడారం రహదారి వెంట వెళ్లాల్సి ఉంటుంది. 
  • ( పస్త్రా – మేడారం)    వరంగల్ , హైదరాబాద్ , నల్లొండ, మహబూబ్ నగర్ మీదుగా వచ్చే వాహనాలు పస్త్రా మీదుగా మేడారం వెళ్లాాలి. తిరుగు ప్రయాణం మాత్రం భూపాలపల్లి మీదుగా ఉంటుంది. మొట్లగూడెం, ప్రాజెక్ట్ నగర్, వెంగ్లాపూర్, చింతల్ ,  కొత్తూరు, కన్నెపల్లి తదితర ప్రాంతాల్లో అధికారులు వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేశారు.
  • (   తాడ్వాయి  – మేడారం) రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చే బస్సులు తాడ్వాయి గుండా మేడారం చేరుకుంటాయి.
  • ఖమ్మం, ఆంధ్ర ప్రదేశ్ ,  ఛత్తీస్ గడ్  ఒడిశా రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలు చిన్నబోయినపల్లి గుండా మేడారం చేరుకోవచ్చు.