Loksabhapolls: తెలంగాణాలో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ హవా కొనసాగే అవకాశం ఉన్నట్లు పీపుల్స్‌పల్స్ – సౌత్‌ఫస్ట్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ట్రాకర్ పోల్ సర్వేలో తేలింది. కాంగ్రెస్ 8-10, బీఆర్‌ఎస్ 35, బిజెపి 2-4, పార్లమెంట్ సీట్లు గెలుపొందే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.
ఇక ఓట్ల శాతం పరంగా చూసుకుంటే..కాంగ్రెస్‌పార్టీకు 40 శాతం, బీఆర్‌ఎస్‌కు 31 శాతం, బిజెపి 23 శాతం, ఇతరులకు 6 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు పీపుల్స్‌పల్స్ – సౌత్‌ఫస్ట్ సర్వే రిపోర్టు చెబుతోంది.
కాగా నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్‌పార్టీ 1 శాతం ఓట్లు, బిజెపి 9 శాతం ఓట్లు అధికంగా పొందుతుండగా , ప్రధాన ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ మాత్రం 6 శాతం ఓట్లు కోల్పోతున్నట్లు తేలింది. కాంగ్రెస్ పార్టీకి మహిళల్లో ఎక్కువ మద్దతు ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది.
ప్రధానిగా ఛాయిస్ విషయంలో ప్రజలు క్లారిటీ తో ఉన్నట్లు సర్వేలో తేలింది. నరేంద్ర మోడీ 34శాతం ఓట్లతో మొదటి వరుసలో ఉండగా..రాహుల్ గాంధీ 23 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలించినట్లు సర్వే రిపోర్ట్ చెబుతోంది.
పీపుల్స్‌పల్స్- సౌత్‌ఫస్ట్ సంస్థలు తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలపై 11 ఫిబ్రవరి నుండి 17 ఫిబ్రవరి వరకు ట్రాకర్ పోల్ సర్వేను నిర్వహించింది. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ట్రాకర్ పోల్ సర్వే కోసం ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గంలో 3 అసెంబ్లీ సెగ్మెంట్లల్లో, 4600 శాంపిల్స్‌తో ఈ సర్వే నిర్వహించినట్లు ప్రకటించింది.