SatyanarayanaSwamy: సత్యనారాయణ స్వామి వ్రతం ఎందుకు చేయాలంటే?

SatyanarayanaSwamy:   హిందూ సంప్రదాయాల్లో సత్యనారాయణ స్వామికి  ఓ ప్రత్యేకత ఉంది. నూతనగంగా గృహ ప్రవేశం చేసేవారు.. కొత్తదంపతులు పెళ్లయిన మరుసటి రోజు స్వామి వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రత్యేకించి కార్తీకమాసంలో సత్యనారాయణ వ్రతం ఆచరించడం హిందువులకు అలవాటు. అయితే  వ్రతాన్ని ఎందుకు ఆచరించాలి?   ప్రత్యేకత ఉంటో  తెలుసుకుందాం!

సత్యనారాయణ స్వామీ వ్రతం నారదుడు సంప్రాప్తినిచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. ఆయన కలహ భోజనుడని తిట్టుకుంటాం కానీ  లోకం హితం కోసం ఆయన అందించిన వరాలు, వ్రతాలు మరేమహర్షి అందంచలేదంటే అతిశయోక్తి కాదు. అందుకు నారదుడు దేవర్షిస్థానాన్ని పొందారు. స్వామీ వ్రతాన్ని ఆచరించడం వల్ల దు:ఖాలు తొలగిపోయి, సకల సంపదలు సంప్రాప్తిస్తాయని.. సంతానం కలుగుతుందని స్వయంగా నారాయణుడే నారదునికి చెప్పాడని పురాణవచనం.

సత్యనారాయణుడు అంటే కేవలం విష్ణుస్వరూపమే కాదు..ఆయన త్రిమూర్త్యాత్మకుడైన కలియుగ దైవం. అందుకే కలియుగంలో స్వామీ వారి వ్రతాన్ని ఆచరించి తీరాలని పండితులు చెబుతుంటారు.

” మూలతో బ్రహ్మారూపాయ మధ్యతశ్చ మహేశ్వరం”

“అధతో విష్ణురూపాయ తర్త్యైక్య రూపాయే తనమ: ” అని సుతిస్తుంటారు.

నూతన దంపతులు తప్పక చేయాల్సిన వ్రతం: 

వివాహం అయిన కొత్త దంపతులు ఈవ్రతం ఆచరించడానికి ఓ కారణం ఉంది. కొత్త జీవితాన్ని ప్రారంభించబోయే దంపతులు సకల సౌభాగ్యాలతో వర్థిల్లాలని స్వామీని ఆరాధిస్తుంటారు. ముఖ్యంగా స్త్రీలు గర్భాదారణ సమయంలో వ్రతం ఆచరించడం వలన వారు సత్ససంబంధాన్ని పొందుతారని విశ్వసిస్తారు.  అంతేకాక స్వామీ వారి ఆశీస్సులతో దాంపత్య జీవితం సాఫీగా సాగుతుందని నమ్మకం. స్వామీ వ్రతం ఆచరించాలి అనుకుంటే కుటుంబ సభ్యులను..బంధుమిత్రులను ఆహ్వానించి నిష్టతో స్వామీవారిని పూజించాలి. అనంతరం బ్రహ్మాణులకు దక్షిణతాంబూలాలు ఇవ్వాలి.  అలా చేస్తే స్వామీ వారి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుందని భక్తుల విశ్వాసం.కలియుగంలో ఈవ్రతం ఆచరించడం వలన విశేష ఫలితానిస్తుందని విష్ణుమూర్తి నారదునికి చెప్పినట్లు స్కాందాపురాణంలో ఉంది.