BjpTelangana:
‘‘వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఎన్నికలు రావడంతో ‘ఇప్పుడు ఓటేయండి. ఆగస్టు 15లోపు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడం పెద్ద బోగస్’’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అని మండిపడ్డారు. ‘‘రైతులు ఆరుగాలం పండించిన వడ్లకు రూ.500 బోనస్ కూడా ఇవ్వలేనోడు… తాలు, తరుగు, తేమ లేకుండా వడ్లు కొనలేనోడు.. ఏకంగా రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామంటే నమ్మేదెవరు?’’అంటూ మండిపడ్డారు.. ఇండ్లు లేని పేదలకు ఇండ్ల జాగాతోపాటు రూ.5 లక్షల ఆర్దిక సాయం చేస్తామని, మహిళలకు నెలనెలా రూ.2,500లు అకౌంట్లో జమ చేస్తామని, విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డు ఇస్తామని, వ్రుద్దులు, వికలాంగులకు రూ.4 వేల పెన్షన్ ఇస్తామని నమ్మించి మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ అని దుయ్యబట్టారు. 6 గ్యారంటీలపై నిలదీయాల్సిన బీఆర్ఎస్ పార్టీ నేతలు… తాము చేసిన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ తో కుమ్మక్కయారని విమర్శించారు. అందులో భాగంగానే 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనకు టచ్ లో ఉన్నారని కేసీఆర్ చెబుతుంటే… 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని సీఎం చెబుతూ… 6 గ్యారంటీలపై ప్రజల్లో జరుగుతున్న చర్చను దారి మళ్లించే కుట్రకు తెరదీశారని మండిపడ్డారు.
కాగా గురువారం సాయంత్రం చొప్పదండి నియోజకవర్గం కొడిమ్యాలకు విచ్చేసిన బండి సంజయ్ కుమార్ సమక్షంలో గౌరపూర్, దమ్మయ్యపేట, కొడిమ్యాల, నాచుపల్లి, హిమ్మత్ నగర్ లకు చెందిన వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు బీజేపీలో చేరారు. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే బోడిగె శోభ, స్థానిక నాయకులతో కలిసి బండి సంజయ్ మాట్లాడారు.కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ బంపర్ మెజారిటీతో గెలవబోతోంది. రాజకీయాలతో సంబంధం లేని యువత సైతం ఇదే చెబుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు కూడా బీజేపీకి ఓటేయాలని భావిస్తున్నారు. మోదీ పాలనలోనే దేశం సురక్షితంగా ఉంటుందని దేశమంతా నమ్ముతోందని సంజయ్ స్పష్టం చేశారు.
కరీంనగర్ లో రూ.12 వేల కోట్లతో అభివ్రుద్ది చేసిన.. అయినా కొంతమంది అడ్డగోలుగా మొరుగుతున్నరు.. వాళ్ల తీరును చూసి ప్రజలు చీదరించుకుంటున్నారనే విషయాన్ని గుర్తించకపోవడం వాళ్ల మూర్ఖత్వమని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ అభ్యర్ధిని మీరెప్పుడైనా చూశారా? మీకెప్పుడైనా కలిశారా? బీఆర్ఎస్ అభ్యర్ధి ఎన్నడైనా మిమ్ముల్ని కలిశారా?… తనకు తాను స్వయం ప్రకటిత మేధావిగా చెప్పుకుంటారు.. ఆయనను సొంత పార్టీ కార్యకర్తలే పట్టించకోవడం లేదు… కార్యకర్తలు, నాయకులను కూడా గుర్తు పట్టలేని మేధావి ఆయన అని సంజయ్ ఎద్దేవ చేశారు.