అవినీతి కేసులో అరెస్టైన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు నెచ్చెలి శశికళ బుధవారం ఉదయం జైలు నుంచి విడుదలయ్యారు. నాలుగేళ్లుగా శిక్ష అనుభవిస్తున్న ఆమె విడుదలకు సంబంధించి జైలు పత్రాన్ని ఉన్నతాధికారులు సమర్పించారు. గత వారం కరోనా సోకడంతో విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె మరి కొన్ని రోజుల పాటు చికిత్స కోసం ఆసుపత్రిలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫిబ్రవరి మొదటి వారంలో ఆమె చెన్నైకి రానున్నట్లు ఆమె సన్నిహితుల నుంచి వినిపిస్తున్న సమాచారం.
ఇక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ శశికళ విడుదల తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆమె సొంత పార్టీ పెడతారన్న లేక వేరే పార్టీతో జాతకడ్తరా అన్నది తెలియాల్సింది. ఆమె విడుదల నేపథ్యంలో తమిళ రాజకీయం ఎలా ఉండబోతుంది అన్న ప్రశ్న అందరిలో నెలకొంది.
శపథం మాటేమిటి..?
అవినీతి కేసులో అరెస్టయిన శశికళ జైలుకు వెళ్తున్న సమయంలో జయలలిత సమాధి పై చేసిన శపధం గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అన్నా డీఎంకే నుంచి ఆమెను బహిష్కరించిన తర్వాత సీఎంగా పళనిస్వామి, డిప్యూటీ సీఎంగా పన్నీర్ సెల్వం పదవులు చేపట్టిన విషయం తెలిసిందే. రానున్న ఎన్నికల్లో ఆమె రాజకీయ ఎంట్రీపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆమె అన్నాడీఎంకే లను కొనసాగుతారా లేక సొంత కుంపటి పెడతారా అనేది తేలాల్సి ఉంది.
జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పార్టికి అన్నీ తానే వ్యవహరించిన శశికళ, ఆమె మరణంతో పార్టీలో ప్రాబల్యం కోల్పోయింది. జయలలిత విధేయుడిగా పేరొందిన పలని స్వామి తిరుగుబాటు చేయడం ముఖ్యమంత్రిగా పళని స్వామి ఎన్నికవడం, ఆమె అవినీతి కేసులు జైలుకెళ్లడం జైలు కెళ్లడం చూస్తుండగానే జరిగిపోయింది.
దినకరన్ ఎక్కడ..?
మరోవైపు ఆమె ప్రధాన అనుచరుడు కుటుంబ సభుడైన టిటిటి దినకరన్ ఉప ఎన్నికల్లో గెలుపు తర్వాత ఏ సమావేశంలోను కనిపించలేదు. శశికళ రీ ఎంట్రీ తో అతను రాష్ట్ర రాజకీయాల్లో కీ రోల్ ప్లే చేస్తాడని ఆమె అనుచర వర్గం గంపెడు ఆశలుపెట్టుకుంది. ఏది ఏమైనా శశికళ ఎంట్రీతో తమిళ రాజకీయం మరోమారు సంచలనాలకు వేదిక కానుంది.
డీఎంకేకి లాభమా..?
శశికళ విడుదల నేపథ్యంలో డీఎంకే పార్టీ ఎటువంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. ఆమె వలన అధికార పార్టీ అన్నాడిఎంకె లో చీలిక రావడం తథ్యమని డీఎంకే పార్టీ భావిస్తోంది. తద్వారా రానున్న ఎన్నికల్లో తమ పార్టీకి లాభం చేకూరుతుందనే దోరణిలో వారు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆమె కనుక సొంత పార్టీ పెట్టకపోతే డీఎంకే తో జతకట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్న మాట.