కోవిషిల్డ్ సంస్థ ‘సీరం’లో భారీ అగ్ని ప్రమాదం

– ఘటనలో ఐదుగురు మృతి

కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీలో ఒకటైన ప్రముఖ ఫార్మ సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(సీఐఐ)కి చెందిన ప్లాంట్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ విషాద ఘటనలో ఐదుగురు మృతిచెందినట్లు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.  ఐదో అంతస్థులో మంటలు చెలరేగడంతో సంస్థ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో రంగంలోకి దిగారు. దాదాపు రెండు గంటల పాటు శ్రమించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

ఇక సంస్థ అధినేత అదర్ పూనావాల స్పందిస్తూ విషాదకర ఘటనకు సంబంధించి ఇపుడే సమాచారం అందింది. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన సిబ్బంది కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు.

కోవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తిలో భారత్ బయోటెక్ సంస్థ తర్వాత , సీరం సంస్థ కోవిషిల్డ్ టీకాలను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఘటన స్థలానికి కొద్ది దూరంలో వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థ ఉన్నట్లు దానికి ఎలాంటి ఆటంకం జరగలేదని సంస్థ వర్గాలు తెలిపాయి.

Optimized by Optimole