అగ్రవర్ణ పేదల కల నెరవేరబోతుంది!

రాష్ట్రంలోని అగ్రవర్ణ పేదలు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న రిజర్వేషన్ల కల ఎట్టకేలకు నెరవేరబోతుంది. రెండేళ్ల కిందట కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 10 శాతం రిజర్వేషన్ల( ఈ డబ్ల్యుఎస్) ఫలాలను తెలంగాణలో అమలుచేయనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రగతి భవన్లో ప్రకటించారు. ఈ విషయానికి సంబంధించి రెండు మూడు రోజుల్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి రిజర్వేషన్లపై ఆదేశాలు జారిచేయనున్నట్లు తెలిపారు. ఇవి అమలులోకి వస్తే రాష్ట్రంలో రిజర్వేషన్ల శాతం 60కి చేరుతుంది.
అర్హులు ఎవరు..?
౼ అగ్రవర్ణ పేద కుటుంబం వార్షిక ఆదాయం 8 లక్షలలోపు ఉన్నవారు.
౼ మున్సిపాలిటీలు , కార్పొరేషన్ల పరిధిలో 100 గజాలకు స్థలంలోపు ఉన్నవారు.
౼ గ్రామీణ ప్రాంతంలో ఐదు ఎకరాలలోపే వ్యవసాయ భూమి ఉన్నవారు.