మంచిర్యాల: సింగరేణి ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతుందన్నారు INTUC నాయకుడు జనక్ ప్రసాద్. కేంద్రం పార్లమెంటులో తీసుకొచ్చిన Mmdr యాక్ట్ కు టిఆర్ఎస్ ఎంపీలు కూడా మద్దతు పలికారని ..ప్రైవేటీకరణ జరిగితే తెలంగాణలో సింగరేణి కనుమరుగు అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ..22 సంవత్సరాలుగా సింగరేణి కంపెనీ లాభాల్లో ఉందన్న ఆయన .. ప్రధాని, కేసీఆర్ లు కార్మికులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. బొగ్గును ఆదాని కంపెనీలో కొనమని కేంద్రం ఆదేశాలు ఇచ్చిందని ..దానివల్ల రాబోయే రోజుల్లో విద్యుత్ రేటు మరింత పెరిగి చిన్న పరిశ్రమలు మూతపడే అవకాశం ఉందన్నారు. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్న దాన్ని పరోక్షంగా అమలు చేసే ప్రయత్నం జరుగుతుందన్నారు. కేంద్ర బడ్జెట్ లో వ్యవసాయానికి కోతలు పెట్టారని.. బడ్జెట్ కార్పొరేట్ కంపెనీలకు లాభం చేసేలా ఉందని జనక్ ప్రసాద్ పేర్కొన్నారు.