శతకొట్టిన శ్రేయస్..ఇ’షాన్’ దార్ ఇన్నింగ్స్.. రెండోవన్డేలో భారత ఘనవిజయం..!!

సౌతాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో టీంఇండియా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో తొలివన్డేలో ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. ఆదివారం జరిగిన రెండో వన్డేలో భారత ఆటగాళ్లు అన్ని విభాగాల్లో అధిపత్యాన్ని ప్రదర్శించారు. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికాను నిర్ణిత ఓవర్లలో 278 పరుగులకు కట్టడి చేశారు. అనంతరం 279 పరుగులు లక్ష్యాన్ని కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించి సీరిస్ ను 1-1 సమం చేశారు.భారత బ్యాటింగ్ లో శ్రేయస్ అయ్యర్ సెంచరీతో చెలరేగగా.. ఇషాన్ కిషన్ (93) తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు.ఇరుజట్ల మధ్య మూడో వన్డే అక్టోబర్ 11న ఢిల్లీలో జరగనుంది.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన దక్షిణఫ్రికా నిర్ణిత ఓవర్లలో 278 పరుగులు చేసింది.ఆజట్టులో మార్కమ్, హెండ్రిక్స్ అర్థసెంచరీలతో చెలరేగారు.మిగతా బ్యాట్స్ మెన్స్ లో క్లాసెన్(30), మిల్లర్(35)ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లో మహ్మాద్ సిరాజ్ మూడు వికెట్లు తీయగా, షాజాద్ అహ్మద్ ,కులదీప్ యాదవ్ చెరో వికెట్ పడగొట్టారు .

శతకొట్టిన శ్రేయర్..ఇ’షాన్’ దార్..
అనంతరం 279 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి టీంఇండియా కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని సొంతం చేసుకుంది.భారత బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్ కెరీర్లో రెండో శతకాన్ని నమోదు చేశాడు. మంచి ఫామ్ లో యంగ్ బ్యాట్స్ మెన్ తనదైన టైమింగ్ తో చూడ ముచ్చటైన షాట్లతో ఆకట్టుకున్నాడు.మరో యువ బ్యాటర్ ఇషాన్ కిషన్(93) షాన్ దార్ ఆటతో తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు.దూకుడైన ఆటతో సిక్సర్ల మోత మోగించాడు. అతని ఇన్నింగ్స్లో ఏడు సిక్సర్లు ఉండటం గమన్హారం. మిగతా బ్యాటర్లలో శుభ్ మన్ గిల్ (28) ఫర్వాలేదనిపించగా.. సంజూ శాంసన్(30) పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. సౌతాఫ్రికా బౌలర్లో ఫోర్జుయిన్, రబాడా చెరో వికెట్ తీశారు.శ్రేయస్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు.

Optimized by Optimole