జన్మష్టమి సందర్భంగా ప్రత్యేకం..

Krishna Janmashtami 2022 : మహావిష్ణువు దశావతారాల్లో ప్రత్యేకమైన ఎనిమిదవ అవతారము శ్రీకృష్ణుడు. అల్లరి చేష్టలతో చిలిపికృష్ణుడిగా అందరి మన్ననలు పొందిన కన్నయ్య 5 వేల 252 సంవత్సరాల క్రితం జన్మించాడని ప్రసిద్ధి.శ్రావణం మాసం అష్టమి తిథి రోహిణినక్షత్రం బుధవారం రాత్రి సమయంలో జన్మించాడని.. కిట్టయ్య జీవిత కాలం 125 సంత్సరాల 8 నెలల 7 రోజులని పురాణా వచన.

శ్రీకృష్ణుని 89వ యేట కురుక్షేత్రం జరిగినది. మహాసంగ్రామం జరిగిన 36సంవత్సరాల తరువాత నిర్యాణం చెందినట్లు పురాణా కథనం. కురుక్షేత్రం క్రీ.పూ. 08.12.3139న మృగసిర శుక్ల ఏకాదశినాడు ప్రారంభమై 25.12.3139 న ముగిసినది. క్రీ.పూ 21.12.3139న 3గం. నుంచి 5గం.లవరకు సంభవించిన సూర్య గ్రహణం జయద్రదుని మరణానికి కారణమైంది.

శ్రీకృష్ణుడిని వివిధ ప్రాంతాలలో వివిధ నామాలతో పూజిస్తారు. మధురలో కన్నయ్య..ఒడిశాలో జగన్నాధ్..మహారాష్ట్ర లో విఠల (విఠోబ..రాజస్తాన్ లో శ్రీనాధుడు..గుజరాత్ లో ద్వారకాదీసుడు & రాంచ్చోడ్..ఉడిపి, కర్ణాటకలో కృష్ణ పిలుస్తారు.

బాలగోపాలునికి జన్మ స్థలం మధుర. జన్మనిచ్చిన తండ్రి వసుదేవుడు తల్లి దేవకీ.పెంచిన తల్లిదండ్రులు నందుడు, యశోద. కిట్టయ్యకు సోదరుడు బలరాముడు, సోదరి సుభద్ర. భార్యలు,రుక్మిణీ, సత్యభామ, జాంబవతీ, కాళింది, మిత్రవింద, నగ్నజితి, భద్ర, లక్ష్మణ.’

శ్రీ కృష్ణుడు జీవితంలో కేవలం నలుగురిని మాత్రమే హతమార్చినట్టు సమాచారం. వారు చాణుర,కుస్తీదారు,కంసుడు (మేనమామ)శిశుపాలుడు మరియు దంతవక్ర (అత్త కొడుకులు).

 

శ్రీ కృష్ణుడు దట్టమైన నీలపు రంగు కలిగిన శరీరముతో పుట్టాడు. గోకులమంతా కన్నయ్య అని పిలిచేవారు. నల్లగా పొట్టిగా ఉన్నాడని, పెంచుకున్నరాని శ్రీ కృష్ణుడుని అందరూ ఆటపట్టిస్తూ ఉండేవారు. అతని బాల్యమంతా జీవన్మరణ పోరాటాలతో సాగింది. కరువు, ఇంకా అడవి తోడేళ్ళ ముప్పు వలన శ్రీకృష్ణుని 9 ఏళ్ల వయసులో గోకులం నుంచి బృందావనం కి మారవలసి వచ్చింది. 14 ఏళ్ల వయసు వరకు బృందావనం లో ఉన్నాడు. తన సొంత మేనమామ కంసుడిని 14-16 వయస్సులో మధుర లో చంపి తనను కన్న తల్లిదండ్రులను చెరసాల నుంచి విముక్తి కలిగించాడు. తను మళ్ళీ ఏనాడు బృందావనానికి తిరిగి రాలేదు.

శ్రీకృష్ణుడు ద్వారకాను పునర్నిర్మించారు. విద్యాభ్యాసం కొరకు 18 ఏళ్ల వయసులో ఉజ్జయినిలో గల సాందీపని యొక్క అశ్రమంకు తరలివెళ్ళెను. గుజరాత్ లో గల ప్రభాస అను సముద్రతీరం వద్ద ఆఫ్రికా సముద్రపు దొంగలతో యుద్ధం చేసి అపహరణకు గురి ఐన తన ఆచార్యుని కుమారుడగు పునర్దత్త ను కాపాడాడు. విద్యాభ్యాసం తరువాత పాండవుల వనవాసమును గురించి తెలుసుకుని వారిని లక్క ఇంటి నుంచి కాపాడి తదుపరి తన సోదరి అగు ద్రౌపదిని పాండవులకు ఇచ్చి పెండ్లి చేశాడు.

పాండవులు ఇంద్రప్రస్థ నగరమును ఏర్పాటు చేసి రాజ్యమును స్థాపింజేసి.. అనంతరం కౌరవుల చెరనుంచి ద్రౌపదిని వస్త్రాపహరణం నుంచి కాపాడాడు. అనంతరం రాజ్యము నుండి పాండవులను వెళ్లగొట్టినప్పుడు వారికి తోడుగా నిలిచాడు. కురుక్షేత్రంలో పాండవుల విజయంలో క్రియాశీలకంగా వ్యవహరించాడు.

శ్రీకృష్ణుడు జీవితం ప్రతిక్షణం సంఘర్షణతో కూడుకున్నది. అతను గతాన్ని, భవిష్యత్తును కూడా తెలుసుకోగల సమర్థుడు ఐనప్పటికీ తను ఎప్పుడు వర్తమానములోనే బ్రతికి.. మానవాళికి గొప్ప పాఠాన్ని బోధించాడు.