టాలీవుడ్ యువ హీరోలు ఒక్కొక్కరుగా బ్యాచిలర్ లైఫ్ కి స్వస్తి చెబుతున్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రానా దగ్గుబాటి, నితిన్ ఇటీవలే ఓ ఇంటివారయ్యారన్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి యువ హీరో సుమంత్ అశ్విన్ జాయిన్ కాబోతున్నాడు. ఈ విషయాన్ని అతని తండ్రి , నిర్మాత ఎమ్మెస్ రాజు ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. దీపిక అనే అమ్మాయితో అశ్విన్ మ్యారేజ్ ఫిక్సైనట్లు త్వరలో వారిద్దరూ ఒక్కటి కాబోతున్నారని రాజు ట్వీట్లో పేర్కొన్నాడు.
సుమంత్ అశ్విన్ హీరోగా ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో వచ్చిన ‘తూనీగ తూనీగ ‘ చిత్రంతో టాలీవుడ్లో అరగ్రేటం చేశాడు. ఆ తర్వాత వచ్చిన ‘కేరింత’ సినిమా అతనికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ప్రస్తుతం అతను ‘ఇది మా కథ చిత్రం’ లో నటిస్తున్నాడు.