లైంగిక వేధింపుల కేసుల్లో వివాదాస్పద తీర్పులు ఇస్తున్న బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ మహిళ న్యాయమూర్తి జస్టిస్ పుష్ప గణేడివాలకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. బాంబే హైకోర్టు శాశ్వత జడ్జిగా ఆమెను నియమించాలని చేసిన సిఫార్సును వెనక్కితీసుకుంది. పొక్సో చట్టం కింద ఇటీవల ఆమె ఇచ్చిన తీర్పులు వివాదాస్పదం కావడంతో గతంలోని సిఫార్సును వెనక్కి తీసుకుంటున్నట్లు సుప్రీంకోర్టు వర్గాలు పేర్కొన్నాయి.
ఇక కేసుల తీర్పుల వివరాల్లోకి వెలితే .. పన్నెండేళ్ల బాలిక వక్షోజాలు నొక్కుతూ లైంగిక దాడికి దిగితే స్కిన్ టు స్కిన్ తాకకపోతే పొక్సో చట్టం కింద నేరం కాదని.. మరో కేసు బాధితురాలి చేతిని గట్టిగా పట్టుకొని , ప్యాంట్ జీప్ తీయడం లైంగిక దాడి కాదని.. ఇచ్చిన తీర్పులు వివాదస్పదం అయినా విషయం తెలిసిందే. దీంతో నెల రోజుల్లో వ్యవధిలో ఆమెకు ఇచ్చిన సిఫార్సును సుప్రీం కొలీజియం వెనక్కి తీసుకుంది.