Article370: ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు కీలకతీర్పు వెలువరించింది. రాజ్యాంగ ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని..రాష్ట్రపతి ప్రకటనపై జోక్యం చేసుకోలేమని ఐదుగురు జడ్జీల ధర్మాసనం తేల్చిచెప్పింది. భారత దేశంలో కాశ్మీర్ విలినమైనప్పుడు ప్రత్యేక హోదాలు లేవని .. కాశ్మీర్ కు ప్రత్యేక సార్వభౌమత్వం లేవని స్పష్టం చేసింది. మిగతా రాష్ట్రాలకు జమ్ము కాశ్మీర్ రాజ్యాంగ హక్కుల విషయంలో ప్రత్యేకత ఏమిలేదని .. రెండు ఉద్దేశ్యాలు కోసమే ఆర్టికల్ 370 ఏర్పాటు అయ్యిందని తెలిపింది. కాశ్మీర్ కు ప్రత్యేక రాజ్యాంగం కేవలం వెసులుబాటు కోసమేనని అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది.