ప్రముఖ నటుడు సూర్య నటించిన ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రం ఆస్కార్ రేసులో నిలిచింది. ఉత్తమ నటుడు, నటి, దర్శకత్వం తో పాటు ఉత్తమ చిత్రం కేటగిరీలో ఈ చిత్రం పోటిపడుతుంది. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో సూర్య సరసన బాలమురళి నటించారు. ప్రముఖ దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వం వహించడం విశేషం. కరోనా లాక్ డౌన్ కారణంగా ఓటిటిలో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభించింది.
కాగా ఆస్కార్ అవార్డ్ కి సంబంధించి థియేటర్స్ లో విడుదలైన చిత్రాలను మాత్రమే పరిగణలోకి తీసుకునేవారు. కానీ కరోనా వలన డిజిటల్ వేదికగా విడుదలైనా చిత్రాలను కూడా పోటీకి అర్హత పొందే విధంగా నిబంధనలను సడలించింది ఆస్కార్ కమిటీ.