ఆర్ఎస్ఎస్ పై మమతా ప్రశంసలు.. స్వార్థం కోసమే అంటూ నేతలు కౌంటర్..!!
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అనూహ్యంగా ఆర్ఎస్ఎస్ పై ప్రశంసల వర్షం కురిపించడం హాట్ టాపిక్ గా మారింది. అవకాశం దొరికితే కాషాయం నేతలపై విరుచుకుపడే మమతా..ఒక్కసారిగా ఆర్ఎస్ఎస్ పై ప్రేమను కురిపించడం ప్రతిపక్షాలకు మింగుడుపడటంలేదు. మమతా బెనర్జీ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారంటూ దుమ్మెత్తిపోస్తున్నాయి.అసలు ఉన్నట్టుండి ఎందుకిలా మమతా ప్రవర్తించారన్నది సర్వత్రా చర్చనీయాంశమైంది. కాగా పశ్చిమబెంగాల్లో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న మమతా బెనర్జీ మాట్లాడుతూ..ఆర్ఎస్ఎస్ అంత చెడ్డది కాదని..సిద్ధాంతాలకు కట్టుబడిన నేతలు బీజేపీలో ఇంకా ఉన్నారంటూ…