చెల్లి ప్రియాంకకు పెట్టిన ముద్దుకు విపరీత ప్రచారం ఇచ్చుకున్న ‘రాహుల్ భయ్యా’!
ఎదురొచ్చిన మహిళలందరికీ ‘జగనన్న’ ముద్దులు పెట్టుకుంటూ పోతే… నెహ్రూ–గాంధీ ‘రాజకుటుంబం’ కాలంతో పాటు మారదంటే మారబోదు అని మరోసారి మొన్న రుజువైంది. రాజధాని దిల్లీకి సమీపంలోని ఉత్తర్ ప్రదేశ్ నగరం బాగపత్ లో భారత్ జోడో యాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన వేదికపై రాహుల్ తన వెంట ఉన్న చెల్లెలు ప్రియాంకా గాంధీ వాడ్రా భుజంపై ఎక్కడ లేని ప్రేమతో చేయి వేసి ఆమె బుగ్గను ముద్దాడారు. కాస్త ఇబ్బందిపడిన ప్రియాంక తొలి భారత కుటుంబంలోని అన్నా…