ysrcp: వైసీపీలో ఏం జరుగుతోంది..?

APpolitics: ‘‘వైసీపీలో ఏం జరుగుతోంది?’’ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్. కృష్ణయ్య, రాజీనామ తర్వాత ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా రాజీనామా చేశారు. ముందు ముగ్గురు రాజీనామాల్లో అంత ప్రత్యేకత ఏమీ లేకపోయినా స్వయం ప్రకటిత జగన్ ఆత్మ అయిన విజయసాయిరెడ్డి రాజీనామ ప్రత్యేకమైనది. జగన్ కి మంచి జరగాలని కోరుకుంటున్నట్టు ట్వీట్ చేసిన ఆయన, జగన్ కష్టకాలంలో…

Read More

APNEWS: గ్రామాల్లో పనులు పండుగలా మొదలుపెట్టాలి: డిప్యూటీ సిఎంపవన్

PawanKalyan:   ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు సత్వరమే మొదలుపెట్టాలని డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఏపీ లో కూటమి పాలన( ఎన్డీయే )మొదలుపెట్టాక పంచాయతీలకు నిధుల సమస్య లేకుండా చేశామని ఆయన  స్పష్టం చేశారు. పాలన మొదలైన తొలి వంద రోజుల్లోనే 15వ ఆర్థిక సంఘం నుంచి రూ.1987 కోట్లు, ఎన్.ఆర్.ఈ.జి.ఎస్. ద్వారా రూ.4500 కోట్లు నిధులు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అందించినందున నిధుల సమస్య ఉత్పన్నం కాదన్నారు. అక్టోబర్ 14వ తేదీ నుంచి ప్రతి…

Read More

OBC: ‘ఓసీ’ ఎంపీలను చూసి ఓబీసీ ఎంపీలు ఏమీ నేర్చుకోలేకపోతున్నారే!

Nancharaiah merugumala senior journalist: తెలుగు నాట‘ఓసీ’ ఎంపీలను చూసి ఓబీసీ ఎంపీలు ఏమీ నేర్చుకోలేకపోతున్నారే! 2019 ఆంధ్రప్రదేశ్‌ సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోయాక, ఈ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు యలమంచిలి సత్యనారాయణ చౌదరి ఉరఫ్‌ సుజనా చౌదరి, గరికపాటి మోహనరావు, సీఎం రమేష్, టీజీ వెంకటేష్‌ టీడీపీ నుంచి చీలిక పేరుతో బయటపడ్డారు. ఆ చీలికను నాటి రాజ్యసభ చైర్మన్‌ అయిన ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు గుర్తించారు. అలాగే, చీలిక ప్రక్రియ…

Read More

SanatanDharma: సనాతన ధర్మ పరిరక్షణకు ప్రాణాలిచ్చేందుకైనా సిద్ధం: పవన్

PawanKalyan: ‘పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో అపవిత్రం జరిగితే వైసీపీ నాయకులు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నా’రని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  మండిపడ్డారు. జగన్ నియమించిన టీటీడీ బోర్డులో తప్పు జరిగిందని ల్యాబ్ రిపోర్టులతో సహా విషయం బయటకు వచ్చినా దబాయింపు చేయడం వైసీపీ నాయకులకు అలవాటుగా మారిందన్నారు. తప్పు జరిగినప్పుడు దానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటామని మాట్లాడాలి లేదా అప్పటి బోర్డులో ఉన్న అధికారులు, బోర్డు సభ్యులు ప్రమేయం మీద మాట్లాడాలి.. అంతేగాని ఇష్టానుసారం మాట్లాడడం…

Read More

Tenali: జగనన్న కాలనీల్లో జగమంత అవినీతి: నాదెండ్ల మనోహర్

Nadendlamanohar: ‘ప్రజా ధనాన్ని కొల్లగొట్టి సొంత ఆస్తులను పెంచుకోవడానికే గత పాలకులు జగనన్న కాలనీల పథకం తీసుకొచ్చారు తప్ప పేదలకు మేలు చేయడానికి కాద’ని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. పేదల ఇళ్ల స్థలాల కోసం భూముల కొనుగోళ్లనూ, గృహ నిర్మాణంలోనూ భారీ అవినీతికి పాల్పడ్డారని అన్నారు. రైతుల నుంచి ఎకరా కోటి రూపాయలకు కొనుగోలు చేసి ప్రభుత్వానికి నాలుగైదు రెట్లు ఎక్కువకు విక్రయించి భారీగా ప్రజాధనాన్ని లూటీ చేశారని చెప్పారు. ప్రజా ధనాన్ని దోచుకున్న…

Read More

GallaMadhavi: చాకలి ఐలమ్మను!’ అంటున్న గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే..!

Nancharaiah merugumala senior journalist: ‘గల్లా మాధవినో, పిడుగురాళ్ల మాధవినో కాదు, చాకలి మాధవిని, చాకలి ఐలమ్మను!’ అంటున్న గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే నిజంగా గ్రేట్ ‘‘నేను గల్లా మాధవినో, పిడుగురాళ్ల మాధవినో కాదు–చాకలి మాధవిని, చాకలి ఐలమ్మను,’’ అని ఇటీవల ఒక బహిరంగ కార్యక్రమంలో ప్రకటించారు ఆంధ్రప్రదేశ్‌ గుంటూరు పశ్చిమ నియోజవర్గం తెలుగుదేశం ఎమ్మెల్యే గల్లా మాధవి. మొన్న అనుకోకుండా ఫేస్‌బుక్‌ వీడియో సెక్షన్‌ను క్లిక్‌ చేయగానే– రజక కుటుంబంలో పుట్టిన ఈ 40…

Read More

Chandrababu: ఏ నమూనాతో బాబు ఏలుతారో..?

 Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ కొత్త పరిపాలనను చవి చూడబోతోంది? అది, సుదీర్ఘ రాజకీయ అనుభవం గ‌డించిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి తాజా ఆలోచనా సరళిని, ఆచరణని బట్టి ఉంటుంది. విభజన తర్వాతి అవశేషాంధ్రప్రదేశ్కు రెండో సీఎం అయిన తాజామాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి, అసెంబ్లీ ఓట్ల లెక్కింపుకు ముందు ఓ ‘వ్యాఖ్య’ చేశారు. ఆయనన్నట్టే… దేశాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే ఫలితాలను (164/175) ఏపీప్రజలిచ్చారు, కానీ, జగన్ ఆశించినట్టు అది ఆయనకు అనుకూలంగా కాదు. ఫలితంగా…

Read More

APpolitics: ఏపీ రాజకీయం..‘‘ఎవరనుకున్నారు…ఇట్లయితదని..?’’

APpolitics:   దివంగత నేత రాజీవ్ గాంధీ నేతృత్వంలో 1984లో జరిగిన దేశ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 400 సీట్లు వచ్చినప్పుడు… ‘‘నాలుగొందల సీట్లు వచ్చాయని, ఆయన గాలి పీల్చద్దంటే పీల్చకుండా ఉండాలా?’’ అని ప్రజాకవి కాళోజీ అనేక సభల్లో ప్రసంగిస్తున్నప్పుడు ఈ ప్రశ్నను సంధించేవారు. ప్రజాకవి కాళోజీ అన్న ఈ మాటలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సరిగ్గా సరిపోతాయి. వ్యవస్థలను నాశనం చేసి, ప్రజల ఆకాంక్షల్ని లెక్కచేయకుండా ఏకపక్ష పాలన చేసినందుకే జగన్ ను వద్దనుకుని…

Read More

Chandrababu: చంద్రబాబుకు లోక‌స‌త్తా బాబ్జి లేఖ.. రైతుల ఖాతాల్లో 20 వేలు జమ చేయండి..!

APpolitics:  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ‘ఏరువాక’ సందర్భంగా లోకసత్తా పార్టీ, రాష్ట్ర అధ్యక్షులు భీశెట్టి బాబ్జి లేఖాస్త్రం సంధించారు.తెలుగుదేశం – జనసేన పార్టీ ఉమ్మడిగా విడుదల చేసిన ప్రజాగళం మ్యానిఫెస్టోలోని సూపర్సిక్స్ హామీల్లో ప్రస్తావించినట్లుగా .. రాష్ట్రంలో రైతాంగానికి పెట్టుబడి సహాయం కింద సంవత్సరానికి రూ.20 వేల రూపాయలు ఆర్థిక సహాయం జమచేయాలని రైతాంగం పక్షాన కోరుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. వ్యవసాయం సీజన్ ప్రారంభం అయ్యిందని..గత ఖరీఫ్, రబీ సీజన్లో వర్షాభావంతో ఒకవైపు కరువు, మరోవైపు డిసెంబర్…

Read More

APpolitics: ‘‘బాబే మారెనా…? ప్రజలనేమారెనా??’’

APpolitics:  ‘మారింది మారింది కాలం…. మారింది మారింది లోకం… ఎక్కడ మారిందమ్మా…? ఇంకా దిగజారిందమ్మా…..!’ అనే సినీ గీతమొకటి  డాక్టర్ సి.నారాయణరెడ్డి రాసింది తెలుగునాట బాగా ప్రసిద్ది. తాను మారానని, మారిన మనిషినని చంద్రబాబునాయుడు ఇటీవల పదే పదే చెబుతున్నారు. బాబు నిజంగా మారారా? నమ్మడానికి మన మనసు అంత తేలిగ్గా అంగీకరించదు. ఎందుకంటే, ఇది ఆయన కన్నా, ఇతరులు చెబితేనే నమ్మాలి. కానీ, ఇప్పటివరకు ఇతరులెవరూ ఆ ముక్క చెప్పట్లేదు. ఆయనే చెబుతున్నారు. ‘మారిన చంద్రబాబును…

Read More
Optimized by Optimole