అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో అమరావతి నిర్మాణం: నారా లోకేష్
అమరావతి: విధ్వంసకర విధానాలతో 5కోట్లమంది భవిష్యత్తును జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు, ఇది కేవలం అమరావతి రైతులకు మాత్రమే సంబంధించిన సమస్య కాదు, యావత్ రాష్ట్రప్రజల సమస్య, సైకో పాలన అంతంతోనే రాష్ట్రానికి మళ్లీ గతవైభవం చేకూరుతుందని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. తాడికొండ నియోజకవర్గం రావెల శివార్లలో అమరావతి ఆవేదన పేరుతో రాజధాని రైతులతో ఏర్పాటుచేసిన ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. లోకేష్ మాట్లాడుతూ… రాష్ట్రంలో పరిస్థితులను…