అవినీతి… అధికారం.. అహంకారంతో నియంతలా మారిన జగన్ : పవన్

Janasena: ‘రాష్ట్రం విడిపోయి దశాబ్ధం అవుతోంది.. ఏపీ రాజధాని ఏది అంటే ఇప్పటికీ చెప్పలేని పరిస్థితి ఉందని ఎద్దేవ చేశారు  పవన్ కళ్యాణ్. అత్తారింటికి దారేది  కథ మూడు గంటల సినిమాతో చెప్పవచ్చు.. అయితే రాజధానికి దారేది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అని ఢిల్లీ నుంచి ఎవరో చెబితేగానీ మనకు తెలియడం లేద’ని జనసేన అధ్యక్షులు  అన్నారు. 2024లో జనసేన – తెలుగుదేశం పార్టీ తప్పనిసరిగా అధికారంలోకి వస్తుందని, ఉత్తరాంధ్ర వలసలను నిరోధించి.. యువతకు చక్కటి ఉపాధి…

Read Full News

‘యువగళం ‘ పాదయాత్ర కి మంగళమేనా?

Naralokesh:టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన  ‘యువగళం ‘ పాదయాత్ర కి మంగళం పాడినట్లేనా? పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తో ఆగిపోయిన పాదయాత్ర కొనసాగే దాఖలాలు కనిపించడం లేదా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బాబు అరెస్ట్ తో గల్లీ వదిలేసి ఢిల్లీలో తిష్ట వేసిన లోకేష్ లో ..ఎంతసేపూ కేంద్ర పెద్దల మెప్పు పొంది కేసుల నుంచి  ఎలా బయట పడలనే తాపత్రయమే కనిపిస్తోందని పార్టీలో బయట గుసగుసలు వినిపించాయి….

Read Full News

చంద్రబాబుకు ‘అనారోగ్యం’ పై ఒక్కో కులం పత్రిక ఒక్కోలా చెబితే ఎలా ?

Nancharaiah merugumala senior journalist: చంద్రబాబుకు ‘అనారోగ్య’ కారణాలపై బెయిలు–అని ‘ఈనాడు, జ్యోతి’ చెబుతుంటే…‘ఆరోగ్య’ కారణాల దృష్ట్యా ఆయనకు బెయిలు మంజూరైందని ‘సాక్షి’ వెల్లడించింది!ఒక్కో కులం పత్రిక ఒక్కో రకంగా చెబితే మామూలు తెలుగోళ్లు ఏమైపోవాలి? గత 52 రోజులుగా రాజమహేంద్రి జైల్లో ఉన్న మాజీ సీఎం, టీడీపీ అగ్రనేత నారా చంద్రబాబు నాయుడుకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేసిందని ఆంధ్రా మూలాలున్న మూడు తెలుగు దినపత్రికల వెబ్‌సైట్లు తెలిపాయి. అయితే, రెండు ‘వ్యవసాయధారిత’…

Read Full News

ఆంధ్రప్రదేశ్‌ ‘ బీసీ’ లకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో టికెట్లు ఇవ్వడం ‘చక్కటి వ్యూహం’..!

Nancharaiah merugumala senior journalist: (తెలంగాణ బీసీలకు ‘ఎక్కువ’ టికెట్లు హైదరాబాద్‌ పాత బస్తీలో ఇస్తుంటే..ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తరాంధ్ర మూడు ఉమ్మడి జిల్లాల్లోనే ఇవ్వడం ‘చక్కటి వ్యూహం’!) =≠====≠======== పెద్దలు డాక్టర్‌ చెరుకు సుధాకర్‌ గారు, మిత్రుడు సంగిశెట్టి శ్రీనివాస్‌ ఇదివరకే చెప్పినట్టు కాంగ్రెస్‌ పార్టీ తన మొదటి జాబితాలోని 12 మంది ఓబీసీల్లో ఐదుగురికి హైదరాబాద్‌ పాత నగరంలోని అసెంబ్లీ స్థానాల టికెట్లు కేటాయించి చేతులు దులిపేసుకుంది. 55 మంది అభ్యర్థుల తొలి లిస్టులో బీసీలకు డజను…

Read Full News

” న్యాయానికి సంకెళ్లు” నిరసన కార్యక్రమంలో నారా లోకేష్, బ్రాహ్మిణి.

APpolitics: “న్యాయానికి సంకెళ్లు” ఇంకెన్నాళ్లని  నారా లోకేష్, బ్రాహ్మణి నినదించారు.  హైదరాబాద్లోని తమ నివాసంలో చేతులకు తాళ్లు కట్టుకుని చంద్రబాబు అక్రమ అరెస్టుని నిరసించారు. ఏ ఆధారాలు లేకపోయినా, రాజకీయ కక్షతో, ప్రజల నుంచి చంద్రబాబుని దూరం చేసేందుకు అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ జ్యుడీషియల్ రిమాండ్ లో ఉంచి చంద్రబాబుకు ప్రాణహాని తలపెట్టాలని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. జైలులో ఆరోగ్యం క్షీణించినా తప్పుడు నివేదికలు ఇస్తూ అంతా బావుందని ప్రభుత్వం మోసపూరితంగా…

Read Full News

NellurRural: ఎమ్మెల్యే కోటంరెడ్డి మరో వినూత్న కార్యక్రమం.. ‘ఒక్కడే ఒంటరిగా’

APpolitics:  నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ‘ మాట మంతి ‘  పేరిట ‘ ఒక్కడే ఒంటరిగా ‘ కార్యక్రమం చేపట్టబోతున్నారు.నియోజకవర్గంలోని  సుమారు లక్ష్య మందిని కలిసేలా ఈ పర్యటన సాగనుంది. ప్రజలను స్వయంగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకోబోతున్నారు.  విజయ దశమి సందర్భంగా  కోటం రెడ్డి ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. 33 రోజుల పాటు జరిగే ‘మాట మంతి’ కోసం ఇప్పటికే  రూట్ మ్యాప్…

Read Full News

జనసేన-టీడీపీ ప్రభుత్వంలో ఏ ఒక్క పథకం ఆగిపోదు: పవన్ కళ్యాణ్

Varahivijayayatra4: ‘జనసేన – తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తే ఏ ఒక్క సంక్షేమ పథకం ఆగిపోవడం జరగదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.పేదలు, బడుగు, బలహీనవర్గాలను ఆదుకుంటున్న ఏ పథకం నిలిపివేయడం జరగదని.. ఇప్పుడున్న సంక్షేమ పథకాలకు మరింత అదనంగా జోడించి వారిని ఆదుకునేలా  ప్రణాళికలు  రూపొందిస్తామని తెలిపారు. అప్పుల ద్వారా కాకుండా ఆదాయం సృష్టించి ప్రజలకు మరింతగా ఇవ్వాలన్నదే తమ ఆకాంక్షగా వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ అప్పుల వల్ల భవిష్యత్తు అంధకారం అవుతుందని హెచ్చరించారు. రాష్ట్రంలోని వనరులను…

Read Full News

చంద్రబాబు రిమాండ్ పొడిగింపు.. భయాందోళనలో టిడిపి శ్రేణులు..

APpolitics : స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ విషయం టీడీపీ పార్టీలో సరికొత్త చర్చకు తావిస్తోంది. గురువారం కేసుపై  అటు చంద్రబాబు..ఇటు ఏసీబీ తరపు వాదనలు విన్న ఏసీబీ కోర్టు ఆయన రిమాండ్ ను అక్టోబర్ 19 వరకు పొడిగించింది. దీంతో టీడీపీ శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన మొదలైంది. మొదట చంద్రబాబును సెప్టెంబరు 9 న అరెస్ట్ చేసినప్పుడు.. షాక్ కి గురైనా.. ఆ పార్టీ నేతలు , కార్యకర్తలు..ఇది  జగన్…

Read Full News

జగన్… ఓ రూపాయి పావలా ముఖ్యమంత్రి : పవన్ కళ్యాణ్

APpolitics: ‘జగన్ ప్రభుత్వ నవరత్నాల హామీలు చూస్తే నా చిన్నప్పటి ‘‘రూపాయి పావలా  మాయ’’ గుర్తుకొస్తుందని ఎద్దేవ చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. నెల్లూరులో తన చిన్నపుడు ఓ పెద్ద బుట్టలో బొమ్మలు పెట్టుకొని రూపాయి పావలా… రూపాయి పావలా అని వీధుల్లో తిరుగుతూ అమ్మేవారని.. చిన్నప్పుడు వాటి కోసం మా అమ్మ దగ్గర మారాం చేసేవాడినని ఆయన గుర్తు చేసుకున్నారు. వారాహి విజయ యాత్ర_ 4 లో భాగంగా పెడన లో నిర్వహించిన బహిరంగ…

Read Full News

ఆంధ్రాలో కులగణన..కాపు, బలిజ, తెలగ ఒంటరి కులాల ‘రాజకీయ సాధికారత’కు అత్యవసరం!

Nancharaiah merugumala senior journalist: (ఆంధ్రాలో కులగణన.. గౌడ, గొల్ల సహా నూటికి పైగా ఉన్న బీసీ కులాల కన్నా..కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల ‘రాజకీయ సాధికారత’కు అత్యవసరం!) ==================== ఆంధ్రాలో కులగణన.. గౌడ, గొల్ల సహా నూటికి పైగా ఉన్న బీసీ కులాల కన్నా ..తమకు ఇంకా చిక్కని రాజ్యాధికారం కోసం ప్రయత్నిస్తున్న కాపులు, బలిజలు, తెలగలు, ఒంటరులకు ఎక్కువ అవసరం. ఈ నాలుగు కులాల జనాభాను విడివిడిగా లెక్కించాలా? లేక హోలు మొత్తంగా…

Read Full News
Optimized by Optimole