” న్యాయానికి సంకెళ్లు” నిరసన కార్యక్రమంలో నారా లోకేష్, బ్రాహ్మిణి.

APpolitics: “న్యాయానికి సంకెళ్లు” ఇంకెన్నాళ్లని  నారా లోకేష్, బ్రాహ్మణి నినదించారు.  హైదరాబాద్లోని తమ నివాసంలో చేతులకు తాళ్లు కట్టుకుని చంద్రబాబు అక్రమ అరెస్టుని నిరసించారు. ఏ ఆధారాలు లేకపోయినా, రాజకీయ కక్షతో, ప్రజల నుంచి చంద్రబాబుని దూరం చేసేందుకు అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ జ్యుడీషియల్ రిమాండ్ లో ఉంచి చంద్రబాబుకు ప్రాణహాని తలపెట్టాలని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. జైలులో ఆరోగ్యం క్షీణించినా తప్పుడు నివేదికలు ఇస్తూ అంతా బావుందని ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తుందని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.