ఏ కన్ను ఇష్టమంటే….!

ఫుట్బాల్ ప్రపంచంలో ఇప్పుడో పనికిమాలిన చర్చ జరుగుతోంది. నిన్న అర్జెంటీనాకు ఫీఫా ప్రపంచ కప్ గెలిచి పెట్టిన కెప్టెన్ లియోనెల్ మెస్సీ గొప్పా? మొన్నెపుడో మొరాకో చేతిలో పోర్చుగల్ ఓడి క్వార్టర్ ఫైనల్లోనే కథ ముగియడంతో వెనుదిరిగిన కెప్టెన్ క్రిష్టియానో రొనాల్డో గొప్పా? అన్నది ఆ చర్చ! ఎంతో తేలికైన, సులువైన, వినచక్కని సమాధానం ఉండగా…. ఈ పండిత చర్చ ఎందుకూ? అన్నది నా వాదన. ఏమిటా సింపుల్ జవాబు? అంటారా! అది, వెరీ సింపుల్. ఏంటంటే…….

Read More

తెగిన శరీరాల అతుకు!

  ‘అబ్బో…. కుటుంబపు మనిషే!’ అనుకున్నారు అంతా ఆయన్ను చూసి. అంతా అంటే…? చుట్టూ స్టేడియం నిండా కిక్కిరిసి, విరగపడి పోయిన లక్ష మందే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారాలు చూస్తున్న కోట్ల మంది. తెల్లవారాక పేపర్లలో, టీవీల్లో, వెబ్సైట్ లలో, ఇంకా ఎన్నెన్నో సామాజిక మాధ్యమ వేదికలపైనా… ఆయన్ని- ఆయననల్లుకున్న కుటుంబాన్నీ చూసిన కోటాను కోట్లమంది. మన దివంగత కమ్యూనిస్టు ఉద్యమనేత భీమ్ రెడ్డి నర్సింహారెడ్డి ఎపుడో అన్నట్టు… ‘అది, తెగి విడిపోయి మళ్లీ…

Read More

ఆహా ఏమి యోగం!

‘జన్మ సార్థకత’ అనే ఓ గొప్ప మాటుంది భారతీయ సంస్కృతిలో. కొంచెం అటిటుగా ప్రపంచపు అన్ని సంస్కృతుల్లోనూ ఇది ఉండే ఉంటుంది. ఇది, అంత తేలిగ్గా అందరికీ లభించదు. లభించడం మహా ఘనతే! ఎందుకంటున్నానంటే… ఇవాళ సాయంత్రం ఓ గంటన్నర సేపు సుమారు 120 కోట్ల మంది (2018 వల్డ్ కప్ ఫైనల్ 112 కోట్ల మంది వీక్షించినట్టు రికార్డు ఉంది) ప్రపంచ జనావళి చూపులు ఓ వ్యక్తి పైన కేంద్రీకృతమౌతున్నాయి. అంతకు రెట్టింపు సంఖ్యలో అంటే,…

Read More

ఇంకా మిగిలే ఉంది!

ఆఫ్రికా సంచలన కూన… మొరాకో కథను క్రొయేషియా 2-1 తో ముగించింది. ఈ సారి ఫీఫా ప్రపంచ కప్ లో ఆఫ్రికా ఖండానికే తొలిసారి సెమీస్ లో స్థానం కల్పించి, చరిత్ర సృష్టించిన ఈ బుల్లి జట్టు సెమీస్ లో డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ చేత ఓడాక, కాస్త చిన్నబోయింది. మూడో స్థానం కోసం శనివారం జరిగిన మ్యాచ్ లోనూ ఓడి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. దూకుడు జట్టైన క్రొయేషియా మేటి, జాస్కో గ్వార్డియల్ ఆట ఆరంభంలోనే…

Read More
Optimized by Optimole