తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు వార్తలు చూసి అలవాటైపోయింది: సంజయ్
BJPTelangana:తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష మార్పుపై ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ తనదైన శైలిలో స్పందించారు. ‘‘తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష మార్పుపై తరుణ్ చుగ్ సహా జాతీయ నాయకులు అనేకసార్లు స్పష్టమైన ప్రకటన చేశారు. అయినా నన్ను మారుస్తున్నారంటూ కొన్ని ఛానళ్లు పదేపదే వార్తలు రాస్తున్నాయి. ఆ వార్తలు చూసి చూసి మా కార్యకర్తలకు అలవాటైపోయింది. రాసి రాసి మీకు అలవాటైనట్లుంది. ఎక్కడైనా నిప్పు లేనిదే పొగరాదంటారు. కానీ ఏడాది నుండి నన్ను మారుస్తారని…