మధ్యప్రదేశ్‌లో బీజేపీకి షాక్ ?
దేశంలో ఉత్తరాది ప్రాంతానికి గుండెకాయ లాంటి మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ ఎన్నికల్లో విజయం సాధించి హిందీ బెల్టు రాష్ట్రాలలో తన పట్టు సడలేదని నిరూపించుకోవాలనే పట్టుదలతో బీజేపీ ఉంటే, ఇక్కడ పగ్గాలు చేపట్టి ఉత్తరాది రాష్ట్రాలతో పాటు దేశంలో బీజేపీ పతనం ప్రారంభమైందనే సంకేతాలివ్వాలని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా కృషి చేస్తోంది. మధ్యప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 230 సీట్లు…