Rangamaarthaanda : బ్రహ్మానందం ‘చక్రపాణి’ పాత్ర తెలుగు ప్రేక్షకులు కలకాలం గుర్తుపెట్టుకుంటారు..!
విశీ( సాయి వంశీ) : మలయాళ సినీరంగంలో సలీమ్ కుమార్ అనే నటుడు ఉన్నారు. హాస్యానికి ట్రేడ్ మార్క్. 41 ఏళ్ల వయసులో ఆయన చేత ‘ఆదామింటె మగన్ అబు’ అనే సినిమాలో ప్రధాన పాత్ర చేయించారు దర్శకుడు సలీమ్ అహ్మద్. ఆయన పక్కన జోడీగా జరీనా వాహబ్. దర్శకుడిగా సలీమ్ అహ్మద్‌కు అదే తొలి సినిమా. హాస్యనటుడిగా పేరు పొందిన వ్యక్తి చేత అంత బరువైన పాత్ర చేయించాలని ఆయన అనుకోవడం నిజంగా సాహసమే! కన్నడ…