Telangana:అసెంబ్లీ సాక్షిగా బడే భాయ్.. చోటే భాయ్ బంధం బయటపడింది: హరీష్ రావు

Telangana: మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బడే భాయ్.. చోటే భాయ్ బంధం అసెంబ్లీ సాక్షిగా బయటపడిందన్నారు.కేంద్రం రాష్ట్రానికి నిధులివ్వకపోయినా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగంలో పల్లెత్తు మాట కూడా అనకపోవడం బంధంలో భాగమేనని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో హరీష్ రావు మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు. కేంద్రం నిధుల విడుదలలో తెలంగాణ రాష్ట్రానికి మొండిచేయి చూపిందని..అయినా ఏమీ అనకుండా బడేభాయ్ తో ఉన్న బంధాని అసెంబ్లీ సాక్షిగా…

Read More

Telangana: అభాండాలు…. అసత్యాలే ప్రతిపక్షాల నైజం..!

INCTelangana: టీపీసీసీ అధ్యక్షులు  మహేష్ కుమార్ గౌడ్ ======================= అసత్యాలను పదేపదే వల్లెవేస్తే అవే వాస్తవాలవుతాయనే భ్రమల్లో ప్రతిపక్షాలున్నాయి. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుంటే తమ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందనే అభద్రతాభావంతో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదంటూ నిరాధార అవాస్తవ ఆరోపణలతో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రభుత్వంపై అభాండాలు వేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఇచ్చిన హామీలను ఒక్కొక్కొటీ నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న ప్రజాదరణను…

Read More

Telangana: టచ్ చేసి చూడు..బట్టలూడదీసి కొడతారు కేటీఆర్: టీపీసీసీ మహేష్ గౌడ్

Tpccmaheshgoud: కేటీఆర్ పై టీపీసీసీ(TPCC )అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. గవర్నర్‌ ప్రసంగాన్ని అవమాన పరిచే విదంగా కేటీఆర్‌ మాట్లాడ్డం ఆయన అహంకారానికి పరాకాష్ట అని.. అధికారం పోయి రోడ్డు మీద పడ్డా బుద్ధి రాలేదని అన్నారు. కేటీఆర్ తక్షణమే గవర్నర్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.2025 – 26 శాసన సభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో మహేష్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. గవర్నర్లను అవమానించిన చరిత్ర బిఆర్ఎస్…

Read More

Telangana: విద్యా సంస్థలలో ‘ఈ’ ఆఫీసు ఆవశ్యకత..!

Telangana: మన తెలంగాణ రాష్ట్రం ఐ.టి. రంగంలో అగ్రగామిగా పేరు గడించింది. ఐ.టి. రంగంలో దేశంలో తలమానికంగా ఎదుగుతున్నది. కోట్లాది రూపాయల సాఫ్ట్వేర్ ఎగుమతులను చేస్తూ దేశ ఆర్థిక రంగానికి వెన్నుదన్నుగా నిలుస్తుంది. భాగ్యనగర కాంతులను విరజిమ్ముతుంది. ఐతే కాంతి రేఖలు నగరాల నుండి అనేక రంగాలకు వెదజల్లాలి అప్పుడే ఆధునిక సాంకేతికత దన్నుతో నూతన జవసత్వాలతో ప్రగతి పతాక ఎగురుతుంది. ఐ.టి.. విద్యారంగంలో వెలుగులు పూయించాలి. ఇప్పటి అనేక ఆఫీసుల్లో ముఖ్యంగా విద్యారంగంలో రాతపూతల పని…

Read More

BRS:‘సైన్యాధ్యక్షుడు’రాని యద్ధం.. నెగ్గేదెలా?

BRSParty: బీఆర్ఎస్ లో అంతర్మధనం..! ‘రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలుండవం‘ టారు. ఏడాది కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో లభించిన ప్రజామద్దతు కాంగ్రెస్ నిలబెట్టుకోకున్నా, ఓటమి నుంచి పాఠం నేర్చి బీఆర్ఎస్ పుంజుకోకున్నా, తద్వారా ఏర్పడే శూన్యంలోకి బీజేపీ విస్తరించకపోయినా… అది మూడు పార్టీలకీ రాజకీయ ఆత్మహత్యా సదృశమే! కాస్త హెచ్చు-తగ్గులతోనే అయినా… ముగ్గురి ముంగిటా ఇపుడు అవకాశాలున్నాయి. అంతా అయ్యాక, తమ దుస్థితికి ఎదుటివారొకరిని నిందించి ప్రయోజనముండదు. స్వయంకృతాపరాధం లేకుండా చూసుకోవడంలోనే నైపుణ్యం, విజయరహస్యం దాగి ఉంది….

Read More

Telangana: ఉద్యమం రోజుల్లోనే తెలుగు తల్లి మీద కెసిఆర్ పెద్ద అబాండం వేశాడు..

Gurramseetaramulu: ఉద్యమం జోరుగా ఉన్న రోజుల్లో తెలుగు తల్లి మీద కెసిఆర్ ఒక పెద్ద అబాండం వేశాడు.. ఎవనికి పుట్టిన తల్లి’..? ఆయన భాష యాస చూసి మోజు పడిన జనులు కెసిఆర్ మాట్లాడే భాష నే అధికారిక భాష అవుద్ది అని ఆశ పడ్డాం. పాలన మారాకా తెలుగు తల్లి విగ్రహానికి  చేతిలో కలశం తీసి బాలనాగమ్మ చీర కట్టి (గులాబీ రంగు) బతుకమ్మ చేతిలో పెట్టి ఇదే తెలంగాణ తల్లి అన్నారు జనాలు నమ్మారు…..

Read More

supremecourt: చట్టం మార్పో? కొత్త చట్టమో..!

AntiDefectionAct: పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని సవరించడమో, మారిన పరిస్థితుల్లో మరో పకడ్బందీ చట్టం తెచ్చుకోవడమో అనివార్యంగా కనిపిస్తోంది. ఇప్పుడున్న చట్టం, ఇదే రూపంలో… ఆశించిన ఫలితాలిచ్చే జాడ కనిపించట్లేదు. నిర్ణయాధికారం స్పీకర్దేనని, దానికి గడువు విధించలేమని న్యాయస్థానం తేల్చడంతో… ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. తెలంగాణలో భారత్ రాష్ట్ర సమితి-బీఆర్ఎస్ తరపున ఎన్నికై కాంగ్రెస్ పార్టీలోకి మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు న్యాయస్థానంలో పిటిషన్లు వేశారు. పిటిషన్లపై నిర్ణయం…

Read More

Telangana: అధికార, విపక్షాల మాటల రాజకీయంతో ప్రజలకు మేలు జరిగేనా..?

Raparthy vinod Kumar : తెలంగాణ లో ఒక్క ఘటనతో రాష్ట్ర రాజకీయాలు అమాంతంగా మారిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేస్తున్న కులగణన ఓవైపు …. మరోవైపు ఫార్మా సిటీ పేరుతో వికారాబాద్ జిల్లాలోని లగచర్లలో భూముల సేకరణకు వెళ్లిన కలెక్టర్ పైదాడి ఘటనలు గత వారం రోజులుగో పేపర్లో హెడ్ లైన్స్ గా, టీవీలో బ్రేకింగ్ న్యూస్ లు అయ్యాయి. కలెక్టర్ నాపై దాడి జరగలేదని చెప్పిన.. ఈ అంశాన్ని రాజకీయం చేస్తూనే ఉన్నారు. మూడు…

Read More

KCR: కేసీఆర్ వ్యూహంతో ఫలితం దక్కేనా?

Telangana politics: రాష్ట్రంలో రాజకీయాలు….. శీతాకాలపు చలిని మరిపించేంత వేడి పుట్టిస్తున్నా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మౌనమే పాటిస్తున్నారు. అప్పుడప్పుడు పార్టీ నాయకులు, కార్యకర్తలతో అంతర్గతంగా మాట్లాడుతున్న అంశాల సారాంశం మాత్రం బయటకు వస్తోంది. ఇటీవలే… పాలకుర్తి నియోజకవర్గం వారితో మాట్లాడి, పంపిందీ అటువంటి సందేశమే! చాన్నాళ్లుగా ఆయన పాటిస్తున్న మౌనం వెనుక ఏముంది! అది వ్యూహాత్మక ఎత్తుగడా? రాజకీయ వైరాగ్యమా? జనం మెదళ్లను ఈ ప్రశ్న తొలుస్తోంది. ఇదుగో ఇప్పుడొస్తారు, అదుగో అప్పుడొస్తారు,…

Read More

Karimnagar: వినోద్ కుమార్ నీ దుకాణం బంద్: బీజేపీ కన్వీనర్ ప్రవీణ్ రావు

BJPKarimnagar:  కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పై మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై కరీంనగర్ బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. స్వయం ప్రకటిత మేధావి గొప్పలు చెప్పుకోవడం తప్ప సాధించిందేమీలేదని.. కరీంనగర్ పార్లమెంట్ ప్రజలు రెండు ఎన్నికల్లో ఘోరంగా ఓడించినప్పటికీ వినోద్ కుమార్ బుద్ది మారలేదని మండిపడ్డారు. జనం మెచ్చిన నాయకుడి పై విషం కక్కుతూనే ఉన్నారని.. బండి…

Read More
Optimized by Optimole