ప్రాణ పదంగా ..పాదయాత్ర సమాహారం..
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పంచకట్టు. తలకు మూడు రంగుల పంచచుట్టి, కాళ్లకు బూట్లు వేసుకొని పాదయాత్ర కొనసాగిస్తున్న భట్టి విక్రమార్కను చూస్తే.. ప్రజలు, కాంగ్రెస్ వర్గీయుల్లో కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది, ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొస్తానని 2003లో వైఎస్ చేపట్టిన పాదయాత్ర రీతిలో నేడు భట్టి పాదయాత్ర కొనసాగుతుంది. ఆదిలాబాద్ జిల్లాలోని అడవిలో నివాసముంటున్న గిరిజన తండాలు, పెంకుటిల్లు లేని పూరి గుడిసెల్లో జీవిస్తున్న వారి వ్యధ, పోడు భూముల కోసం ఆశగా ఎదురు చూస్తున్న గిరిజనల గోసను, వారి…