Climatechange: సమర్థ నాయకత్వమే సవాల్..!
Globalleadershipproblem: ప్రపంచమే తీవ్ర నాయకత్వ సమస్యనెదుర్కొంటోంది. సమకాలీన సమస్యల్ని సానుభూతితో పరిశీలించి, అర్థం చేసుకొని.. విశాల జనహితంలో సాహస నిర్ణయాలు తీసుకునే చొరవగల నాయకత్వానికి ఇప్పుడు మహాకొరత ఉంది. ఫలితంగా ఎన్ని అనర్ధాలో ! మానవాళి మనుగడకే ప్రమాదం తెస్తున్న ‘వాతావరణ మార్పు’ (క్లైమెట్ చేంజ్) విపరిణామాలు అడ్డుకునేందుకు పెద్దఎత్తున నిర్వహించే భాగస్వామ్య దేశాల సదస్సు`కాప్ కూడా విఫలమౌతోంది. దాదాపు రెండొందల దేశాలు పాల్గొనే ఈ సదస్సులు ఏటేటా ఆశావహ వాతావరణంలో మొదలై, కడకు ఉస్సురనిపిస్తూ ముగియడం…