సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ ఫైర్!
కేసీఆర్ కల్లబొల్లి మాటల్తో మరోసారి ప్రజలను మభ్యపెడుతున్నారని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్ సాగర్ పర్యటనపై ఆయాన స్పందిస్తూ మీడియాకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగమని సాగర్ ఎన్నికల ప్రచారం సాక్షిగా కేసీఆర్ పచ్చి అబద్దమాడాడని సంజయ్ తెలిపారు. గిరిజన రైతుల భూములను అధికార ఎమ్మెల్యే కబ్జా చేశారని, ప్రశ్నించిన గిరిజనులపై దాడి చేయించి, జైల్లో పెట్టడంపై ముఖ్యమంత్రి సమాధానం చెబితే బాగుండేదని…