అసోంలో రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం కోక్రఝార్ లోని బహిరంగ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రాన్ని అవినీతి, ఉగ్రవాద రహితంగా మార్చిందని.. రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఎన్డీఏకు పట్టం కడతారని స్పష్టం చేశారు.
ఇక ఈశాన్య రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలకు ముగింపు పలుకుతూ పలు ఒప్పందాలు జరిగాయన్నారు. గత పాలకుల హయాంలో ఒప్పందాలు జరిగిన అవి కాగితాలకే పరిమితమైనవి గుర్తు చేశారు.
కాగా బిటిఆర్ ఒప్పందం ప్రకారం అనేక హామీలను నెరవేర్చమన్నారు. ప్రాంత అభివృద్ధికి భాజపా కట్టుబడి ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర సంస్కృతి, భాషను కాపాడడంతో పాటూ .. అన్ని వర్గాల ప్రజలకు భద్రత కల్పించడంలో భాజపా ఎనలేని కృషి చేస్తుందని తెలిపారు. ఈ సంద్భంగా బోడో ప్రాంతంలో రహదారి నిర్మాణానికి 500 కోట్లు ప్రకటించారు.