బాలీవుడ్ యువహీరో వరుణ్ ధావన్ మరికొన్ని గంటల్లో ఓఇంటివాడుకానున్నాడు. చిన్ననాటి స్నేహితురాలు, ప్రేయసీ నటాషా దలాల్ ను ఆదివారం ముంబైలోని ఓ హోటల్లో కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య వివాహమాడనున్నాడు. కోవిడ్ పరిస్థితులు దృష్ట్యా ఈ వివాహానికి అతికొద్ది మంది మాత్రమే హాజరుకానున్నారు. బాలీవుడ్ హీరోలు సల్మాన్ ఖాన్ , కత్రినాకైఫ్, కరణ్ జోహార్ పెళ్లి సమయానికి వస్తారని సమాచారం.
వివాహానికి ముందు నిర్వహించే సంగీత్ వేడుక శనివారం ఘనంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరుల్ గా మారాయి. ఈ వేడుకకు ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ వీణ మల్హోత్రా పాల్గొన్నారు.