Telangana: తెలంగాణలో పెరుగుతున్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు!
హైదరాబాద్: తెలంగాణలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. సాగునీటి ప్రాజెక్టులు, రిజర్వాయర్లు అందుబాటులోకి వస్తున్నప్పటికీ.. అనేక ప్రాంతాల్లో రైతులు సాగునీటి కోసం బోరుబావులపైనే ఆధారపడుతున్నారు. దీంతో వ్యవసాయ మోటార్ కనెక్షన్ల సంఖ్య ఏటా పెరుగుతోంది. మరోవైపు రైతులకు ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం వెచ్చిస్తున్న సబ్సిడీ భారం కూడా వేల కోట్ల రూపాయలకు చేరింది. రెండేళ్లలో 1.91 లక్షల కొత్త కనెక్షన్లు తెలంగాణలో 2024 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు రెండేళ్ల వ్యవధిలో…
