ప్రజల అరికాలి కింద పచ్చలు పచ్చలుగా పగిలిన ప్రజా యుద్ద నౌక..
గద్దర్ అనే వాడు చస్తే బాగుండు అని కోరిన ప్రజలు కూడా వుంటారా?వున్నారు. అలాంటి ప్రజలే ఎక్కువ శాతం వున్నారు.పాట గొప్పదే. పాట మాత్రమే గొప్పది. ఆచరణ లేని పాట ప్రజా శత్రువుతో సమానం. “శత్రువుపై జాలి లేని వాడే మన స్నేహితుడు” అని పాట పాడిన చెరబండరాజు పదేపదే గుర్తుకొస్తున్నాడు. గద్దర్ ప్రజా శత్రువు. ఆచరణ లేని సృజన ప్రజాపోరాటాలకు ఏమాత్రం అవసరమే లేదు. ప్రజా యుద్దమే లేకపోతే గద్దర్ లేడు. ప్రజా యుద్దమే లేకపోతే…